Canara Bank Jobs: దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా డిజిటలైజేషన్ జరుగుతున్న వేళ టెక్కీలకు మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల వరకు అన్నింటిలోనూ వేగంగా రిక్రూట్మెంట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకుతున్న టెక్కీలకు కెనరా బ్యాంక్ శుభవార్త చెప్పింది. బ్యాంకుకు చెందిన బెంగళూరు విభాగంలోని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో దాదాపు 60 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా నిరుద్యోగ టెక్కీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కంపెనీ కాంట్రాక్టు పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే కంపెనీ అప్లికేషన్ డెవలెపర్స్ 7, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ 2, క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్ 2, డేటా అనలిస్ట్ 1, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ 9, డేటా ఇంజినీర్ 2, డేటా మైనింగ్ ఎక్స్పర్ట్ 2, డేటా సైంటిస్ట్ 2, ఎథికల్ హ్యాకర్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్ 1, ఈటీఎల్ స్పెషలిస్ట్ 2,జీఆర్సీ అనలిస్ట్ ఐటీ గవర్నెన్స్, ఐటీ రిస్క్ అండ్ కంప్లయన్స్ 1, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ 6, ఆఫీసర్ 7, ఫ్లాట్ ఫామ్ అడ్మినిస్ట్రేటర్ 1, ప్రైవేట్ క్లౌడ్ అండ్ వీఎంవేర్ అడ్మినిస్ట్రేటర్ 1, సొల్యూషన్ ఆర్కిటెక్ట్1, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 8 పోస్టులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని బ్యాంక్ తాజా నోటిఫికేషన్లో పేర్కొంది.
అయితే ఉద్యోగానికి తగిన బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలని వెల్లడిస్తూ అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదని స్పష్టం చేసింది. అయితే ఇదే క్రమంలో ఓబీసీ, ఎస్టీ కేటగిరీలో అప్లై చేస్తున్న అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉందని కంపెనీ వెల్లడించింది. జనవరి 6 నుంచి జనవరి 24 వరకు పైన పేర్కొన్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు వార్షికంగా గరిష్ఠ ప్యాకేజీ 27 లక్షల వరకు బ్యాంక్ చెల్లించటానికి ప్రస్తుతం సిద్ధంగా ఉంది. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ప్రాతిపధికన నియామకాలు ఉంటాయని నోటిఫికేషన్లో వెల్లడించింది.
ఇదే క్రమంలో కంపెనీ అభ్యుర్థులకు పేర్కొన్న విభాగాల్లో ముందుగా పనిచేసిన అనుభవం కూడా తప్పనిసరిగా పేర్కొంది. అంటే ఇప్పటికే పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఉద్యోగ మార్పుల కోసం వెతుకుతుంటే వారికి ఇదొక సదవకాశం. పైగా బ్యాంకులో పనిచేయాలని భావించే వారు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చని గుర్తుంచుకోండి. వార్షిక ప్యాకేజీ కూడా రూ.18-27 లక్షల మధ్య ఆఫర్ చేయటం చాలా మందికి ఆకర్షనీయంగా మారుతోంది.
More From GoodReturns

నేడు బ్యాంక్ సెలవు: మీ డబ్బు లావాదేవీలు ఆగిపోతాయా?

అంబేడ్కర్ జయంతి: నేడు బ్యాంకులు మూసి ఉన్నా మీ డబ్బులు సురక్షితమేనా?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications