IT Jobs: హైదరాబాదులో ఏడాదికి రూ.20 లక్షల శాలరీ ఆఫర్ చేస్తున్న ఐటీ కంపెనీ..!
Hyderabad Jobs: కొత్త ఉద్యోగాల కోసం వేట కొనసాగిస్తున్న యువతకు బెంగళూరు, పూణే, చెన్నై, ముంబై వంటి నగరాలకు పోటీగా ఉద్యోగాలను అందిస్తోంది హైదరాబాద్. ఇటీవలి కాలంలో నగరం ప్రపంచ కంపెనీలకు కేంద్ర బిందువుగా మారటంతో అనేక కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. హై పెయిడ్ జాబ్ హోల్డర్లు మెచ్చే నగరంగా హైదరాబాద్ మారిపోయింది.
ఇప్పడు మనం మాట్లాడుకోబోతున్నది డాట్ నెట్ బ్యాకెండ్ డెవలపర్ ఉద్యోగం గురించి. గార్డియన్ ఇన్ఫోటెక్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు 5-9 ఏళ్లు అనుభవం కలిగిన వ్యక్తుల కోసం జాబ్ ఆఫర్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఎంపికైన ఉద్యోగులకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజీని అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం దీని కింద కంపెనీ కేవలం ఒక్క ఓపెనింగ్ మాత్రమే ఉన్నట్లు ప్రకటించింది. ఉద్యోగంలో చేరటానికి ఎంపికయ్యే వ్యక్తి వెంటనే జేరటానికి లేదా కనీసం 30 రోజుల పాటు నోటీస్ పిరియడ్ కింద అందుబాటులో ఉండాలని కంపెనీ వెల్లడించింది.

ఇదే క్రమంలో ఎంపికైన టెక్కీ హైదరాబాద్, బెంగళూరు, పూణే, కలకత్తాల్లో పనిచేయటానికి అనువుగా ఉండాలని కోరుతోంది. ఈ అప్లికేషన్ టైప్‌స్క్రిప్ట్, .NET కోర్ బ్యాకెండ్‌తో యాంగ్యులర్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ప్రభావితం చేసే మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ స్టాక్ సొల్యూషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా అజూర్‌లో అమలు చేయబడింది. అజూర్ SQL, కాస్మోస్, రెడిస్, యాప్ సర్వీసెస్, డిప్లాయ్‌మెంట్ స్లాట్‌ల వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. ఇదేక్రమంలో కంపెనీ ఇంటర్వ్యూకి కనీస అర్హతగా ఫుల్ స్టాడ్ డెవలపర్ కింద కనీసం 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం కలిగి ఉండాలని కంపెనీ పేర్కొంది.
అజైల్ ప్రాసెస్ గురించి అవగాహన కావాలని సూచింది. ఈ క్రమంలో లాస్, పాస్ టెక్నాలజీలపై అవగాహన కావాలని సూచించింది. అనలసిస్ స్కిల్స్ తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా కంపెనీ పేర్కొంది. అలాగే బృందాలతో పనిచేయటంలో అనుకూలంగా ఉండాలని సూచించింది. ఇన్సూరెన్స్ వ్యాపారానికి సంబంధించి కొంత అవగాహన ఉండటం ఉత్తమంగా కంపెనీ పేర్కొంది. ఈ జాబ్ కోసం ఆసక్తి కలిగిన వ్యక్తులు తమ రెజ్యూమ్ [email protected] కి పంపాలని లేదా 8121113721కి కాల్ చేయాలని కంపెనీ స్పష్టం చేసింది. వాస్తవానికి ఇదొక ఫుల్ టైం జాబ్ కావటం గమనార్హం.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications