A Oneindia Venture

ఇండియాలో 500 మంది ఉద్యోగులపై వేటు వేసిన అమెజాన్.. ఈ జాబ్స్ అన్నీ AI భర్తీ చేస్తుదంటూ..

అమెజాన్ మరోసారి ఉద్యోగాల తొలగింపులు చేపట్టింది. తాజా సమాచారం ప్రకారం భారత్‌లో అమెజాన్ ఇండియా కార్యకలాపాల్లో భాగంగా 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ తాజా లేఆఫ్స్‌లో ముఖ్యంగా టెక్నాలజీ (Tech), హ్యూమన్ రిసోర్సెస్ (HR) విభాగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. గ్లోబల్ స్థాయిలో ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. కోవిడ్ తర్వాత కాలంలో వేగంగా పెరిగిన నియామకాలను సమీక్షిస్తూ.. ఇప్పుడు అవసరం లేని లేదా డూప్లికేట్ పాత్రలను తొలగించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగానే భారత్‌లో కూడా వందల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈ లేఆఫ్స్ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, రిక్రూట్‌మెంట్, HR ఆపరేషన్స్ వంటి విభాగాల్లో చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. అమెజాన్ ఇండియాలో ఈ విభాగాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉండటంతో.. కోతల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కొందరు ఉద్యోగులకు అకస్మాత్తుగా యాక్సెస్ నిలిపివేయడం, అంతర్గత ఈమెయిల్స్ ద్వారా సమాచారం ఇవ్వడం వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

Amazon layoffs India Amazon job cuts India Amazon lays off 500 employees Amazon India layoffs 2026 Amazon workforce reduction Amazon downsizing India Amazon employees laid off Amazon tech layoffs Amazon HR layoffs Amazon software jobs cut India Amazon IT layoffs India Amazon corporate layoffs India Big tech layoffs India tech layoffs news India IT sector job cuts global tech slowdown corporate restructuring Amazon why Amazon laid off employees in India Amazon layoffs impact on tech jobs Amazon India job cuts explained Amazon 500 employees laid off reason Amazon latest layoffs news Amazon breaking news India Amazon job news today layoffs news India tech industry layoffs today Amazon company updates 500 HR 500

Amazon ఈ లేఆఫ్స్‌పై అధికారికంగా పెద్ద ప్రకటన చేయకపోయినా.. వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని సరళీకృతం చేస్తున్నాం అనే వ్యాఖ్యలను గతంలో పలుమార్లు చేసింది. అంటే లాభదాయకత పెంచడం, ఖర్చులు నియంత్రించడం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్‌పై ఎక్కువగా ఆధారపడటం వంటి వ్యూహాలే ఈ ఉద్యోగాల తొలగింపులకు నేపథ్యంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా HR విభాగంలో ఉద్యోగాల కోత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో భారీగా నియామకాలు చేసిన సంస్థలు, ఇప్పుడు అదే స్థాయిలో రిక్రూట్‌మెంట్ అవసరం లేకపోవడంతో HR టీమ్‌లను తగ్గిస్తున్నాయి. అలాగే టెక్ విభాగంలో కూడా AI టూల్స్, ఆటోమేటెడ్ సిస్టమ్స్ పెరగడంతో కొన్ని పాత్రలు అవసరం లేనివిగా మారుతున్నాయి.

ఈ పరిణామం భారత్‌లోని టెక్ ఉద్యోగ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలు నియామకాలను తగ్గించగా.. తాజా అమెజాన్ లేఆఫ్స్ ఉద్యోగార్థుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ముఖ్యంగా స్టార్టప్ రంగంలోనూ ఖర్చుల నియంత్రణ మొదలవడంతో కొత్త అవకాశాలు గతంతో పోలిస్తే తగ్గుతున్నాయి.

మరోవైపు Amazon భారత్ మార్కెట్‌పై ఆసక్తి కోల్పోయిందన్న భావన సరైంది కాదని నిపుణులు అంటున్నారు. ఈ-కామర్స్, క్లౌడ్ (AWS), డిజిటల్ పేమెంట్స్ వంటి రంగాల్లో అమెజాన్ పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ సంస్థ వ్యూహాత్మకంగా తన బలగాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ, లాభదాయకమైన విభాగాలపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతోంది.

క్లుప్తంగా చెప్పాలంటే అమెజాన్ భారత్‌లో 500 మందికి పైగా ఉద్యోగాల తొలగింపు అనేది ఒక్క కంపెనీ సమస్యగా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న బిగ్ టెక్ రీస్ట్రక్చరింగ్ ట్రెండ్‌కు ప్రతిబింబంగా చూడాల్సిన పరిణామంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో టెక్ రంగంలో ఉద్యోగ భద్రత, స్కిల్ అప్‌గ్రేడేషన్, AI‌కు అనుగుణంగా మారడం వంటి అంశాలు మరింత కీలకంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+