ప్రపంచ వ్యాప్తంగా ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తోంది. ప్రతీ చిన్న పనికి కంపెనీలు ఐఏని వాడుతున్నాయి. టెక్నాలజీ పెరిగే కొద్ది మనుషుల్లో కూడా భయాలు పెరుగుతున్నాయి. కొత్తగా వచ్చే టెక్నాలజీ మనుషులను ఆర్థికంగా దెబ్బ తీస్తుందేమోననే భయం ప్రతి ఒక్కరినీ వెండాడుతోంది. దీంతో చాలామందిని ఏఐ వెంటాడుతోంది. వారిలో ఉద్యోగ భయాల్నికలిగిస్తోంది. ఏఐతో ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని చాలామంది ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు చాలా కంపెనీలు ఉద్యోగులను బయటకు సాగనంపడం కూడా దీనికి మరింత బలాన్ని ఇస్తోంది.
అయితే తాజాగా ప్రపంచ ఏఐ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఉద్యోగ పోర్టల్ నౌక్రీ ఏఐ మీద సంచలన రిపోర్ట్ ను విడుదల చేసింది. 16 జూలై 2025న భారతీయ ఉద్యోగ పోర్టల్ Naukri.com విడుదల చేసిన తాజా సర్వేలో భారతీయ ఉద్యోగ మార్కెట్‌కి సంబంధించిన ఉద్యోగ అవకాశాల మార్కెట్ మీద స్పష్టమైన డేటాను ప్రచురించింది. ఈ డేటా ప్రకారం.. ఏఐతో ఉద్యోగాలు పోవడం సంగతి పక్కన పెడితే.. వేతనాలు భారీ స్థాయిలో పెరగడంతో పాటు కొత్త అవకాశాలు వెల్లువలా వస్తున్నాయని తెలిపింది.

వేలాది జాబ్ పోస్టింగ్స్ విశ్లేషణ ఆధారంగా రిపోర్ట్ తయారు చేశారు. అలాగే ఈ సర్వేలో 60 వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో పాటుగా చాలామంది రిక్రూటర్ ఓపినియన్ కూడా తీసుకున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే AIని భారతదేశంలో చాలామంది తమ స్నేహితుడుగా భావిస్తున్నారు. ఏఐ జాబ్స్ పెద్ద వేతనం ఇవ్వవనే భావన తప్పు అని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఏఐ స్కిల్స్ కలిగినవారికి అన్ని రోల్స్‌ల్లో సగటున 53 శాతం వరకు జీతాల పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు ఏఐ రాకతో ఉద్యోగ నష్టం ఉంటుందని భావిస్తున్నారు.
ఏప్రిల్-జూన్ 2025 సమయంలో Naukriలో 35 వేలకు పైగా AI/ML ఉద్యోగాలు కనిపించాయి. అయితే మెట్రోలకు మాత్రమే ఏఐ రోల్స్ పరిమితం కాలేదని డేటా స్పష్టం చేస్తోంది. ఇండోర్, కొయంబత్తూరు, కొచ్చి, అహ్మదాబాద్ వంటి టియర్-2 నగరాలు కలిపి 1,500కు పైగా ఏఐ జాబ్స్ ఈ పోర్టల్ లో కనిపించాయి. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే.. AI వల్ల ఉద్యోగం కోల్పోతామన్న భయం చాలాతక్కువ మందిలో కనిపిస్తోంది. ముగ్గురిలో ఒకరికి మాత్రమే ఈ భయం కనిపించింది. 35 శాతం మంది ఏఐ రాకతో కొత్త ఆలోచన ఉండదని తెలిపారు. ఉద్యోగ భద్రత కన్నా పనిలో నూతన ఆలోచనల స్థిరత్వం పైనే ఎక్కువ దృష్టి ఎక్కువ పెట్టాలని తెలిపారు.
AI రిలేటెడ్ జాబ్స్ మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్, సెర్చ్ ఇంజినీర్,డేటా సైంటిస్ట్ తో పాటుగా మరిన్ని జాబ్స్ నిరుద్యోగులకు రెడీగా ఉన్నాయి. తాజాగా అకౌంటింగ్, KPO (నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్), బ్యాంకింగ్ వంటి సాంప్రదాయేతర రంగాలు కూడా ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఉద్యోగులను వెతుకుతున్నాయి. ఎక్కువగా ఆందోళన కలిగించిన బిపిఒ రంగం కూడా ఏఐ రంగంలో ఏప్రిల్-జూన్ 2025 కాలంలో భారీ ఉద్యోగాలను అందిపుచ్చుకుంది. కాబట్టి నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగ భయాల్ని పక్కనబెట్టి.. మార్కెట్ ఎక్కడికి వెళుతోంది అన్న దానిపైన దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications