ఏఐ రాకతో ఉద్యోగులు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు తమ జాబు ఊడుతుందో తెలియని పరిస్థితి. నిపుణులు ఏఐతో జాబులు ఇంకా పెరుగుతాయని చెబుతున్నా వాస్తవం మాత్రం వేరేలా ఉంది. టాప్ కంపెనీలు ఏఐ మీద పెట్టుబడులను పెడుతూ ఉద్యోగుల కోత విధిస్తున్నాయి. కాస్ట్ కటింగ్ ప్లాన్ లో భాగంగా టాప్ కంపెనీల నుంచి లక్షలాది మంది ఉద్యోగులు గతేడాది రోడ్డు మీదకు వచ్చారు. ఈ ఏడాది కూడా భారీగా లేఆప్స్ ఉండబోతున్నాయనే అంచనాలు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
కంప్యూటర్లపై ఆధారపడి పనిచేసే చాలా వైట్-కాలర్ ఉద్యోగాలు రాబోయే 12 నుంచి 18 నెలల్లో గణనీయంగా మారిపోతాయని.. వాటిలో చాలా వరకు పూర్తిగా ఆటోమేషన్‌కు లోనయ్యే అవకాశముందని మైక్రోసాఫ్ట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భవిష్యత్తుపై చర్చను మరింత వేడెక్కించాయి.

మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ప్రొఫెషనల్-గ్రేడ్ AGI (Artificial General Intelligence) అభివృద్ధిపై దృష్టి పెట్టిందని సులేమాన్ తెలిపారు. ఇది ఒక మానవ ప్రొఫెషనల్ చేయగలిగే పనులను దాదాపుగా అదే స్థాయిలో నిర్వహించగల ఏఐ వ్యవస్థ అని ఆయన వివరించారు. న్యాయవాదులు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ నిపుణులు వంటి వృత్తుల్లో జరిగే అనేక పనులను ఈ టెక్నాలజీ ఆటోమేట్ చేయగలదని చెప్పారు. కేవలం ఉత్పాదకత పెరుగుదల మాత్రమే కాకుండా, జ్ఞాన-ఆధారిత ఉద్యోగాల్లో నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మీరు కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఏ వైట్-కాలర్ ఉద్యోగమైనా.. అది న్యాయవాదిగా కావచ్చు, అకౌంటెంట్‌గా కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ లేదా మార్కెటర్‌గా కావచ్చు. ఆ పనుల్లో చాలా భాగం రాబోయే 12 నుంచి 18 నెలల్లో ఏఐ ద్వారా ఆటోమేట్ అవుతుందని సులేమాన్ వ్యాఖ్యానించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మానవ నైపుణ్యం అవసరమయ్యే డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్, డేటా విశ్లేషణ, ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ వంటి రొటీన్ పనులను ఏఐ స్వీకరిస్తుందని ఆయన తెలిపారు.
ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించడమే మైక్రోసాఫ్ట్ వ్యూహమని సులేమాన్ వివరించారు. సంస్థల రోజువారీ పనులను సరళతరం చేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించడంతో పాటు వేగాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో.. ఇటీవల సవరించిన ఒప్పందం తర్వాత OpenAIపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వంత ఏఐ మోడళ్ల ఉత్పత్తిని పెంచాలని Microsoft యోచిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
ఇంకా కొత్త ఏఐ మోడల్‌ను సృష్టించడం పాడ్‌కాస్ట్ చేయడం లేదా బ్లాగ్ రాయడం లాగే సులభమవుతుంది" అని సులేమాన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో సంస్థలు, వ్యక్తులు తమ అవసరాలకు అనుగుణంగా స్వంత ఏఐ వ్యవస్థలను రూపొందించుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ మార్పుల ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కనిపిస్తోంది. అమెరికా టెక్ దిగ్గజం Oracle తన ఏఐ డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు 20 వేల నుంచి 30 వేల ఉద్యోగాలను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు Amazon కూడా తన ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణలో భాగంగా సుమారు 16,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, ఏఐ వల్ల వచ్చే ఆర్థిక లాభాలు కూడా అంతే పెద్దవిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. PwC India తాజా నివేదిక ప్రకారం, వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ మరియు తయారీ వంటి ఐదు ప్రాధాన్యతా రంగాల్లో 2035 నాటికి కృత్రిమ మేధస్సు భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు 550 బిలియన్ డాలర్ల విలువను చేర్చగలదు. ఇదే దిశగా.. 2024లో 1.2 బిలియన్ డాలర్ల నిధులతో ప్రారంభమైన IndiaAI Mission దేశంలో కంప్యూటింగ్ వనరులు, డేటాసెట్లు మరియు ప్రతిభ అభివృద్ధిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. Jobs మారుతున్న ఈ యుగంలో, ఏఐతో కలిసి పనిచేసే నైపుణ్యాలే భవిష్యత్తులో కీలకమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

క్వాంటం కంప్యూటర్ అంటే ఏమిటి.. దాని వల్ల లాభాలు, వచ్చే నష్టాలు ఏమిటి.. పూర్తి సమాచారం ఇదిగో..

14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..

ఐటీ స్టాక్స్ Q4 ఫలితాలు..TCS, ఇన్ఫోసిస్ నుండి HCL టెక్ వరకు.. షేర్లు కొనుగోలుపై బిగ్ అలర్ట్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications