Accenture Jobs: అమెరికా టెక్ దిగ్గజం యాక్సెంచర్ భారతదేశంలో ఎక్కువ మెుత్తంలో ఉద్యోగులను కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేస్తూ అనేక కంపెనీలకు సేవలను అందిస్తున్నప్పటికీ మెజారిటీ వర్క్ ఫోర్స్ ఇండియాలోనే ఉండటం గమనార్హం. వాస్తవానికి కంపెనీ చెన్నై కేంద్రంగా వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ తర్వాతి కాలంలో కార్యకలాపాలను అమెరికా కేంద్రంగా షిఫ్ట్ చేసింది.
తాజాగా కంపెనీ హైదరాబాదులో ఫుల్ టైం ఉద్యోగం కోసం లింక్డిన్ పోస్ట్ విడుదల చేసింది. ఇది పూర్తిగా ఆఫీసు నుంచి చేసే ఉద్యోగంగా కంపెనీ పేర్కొంది. అయితే ఉద్యోగి వేతనానికి సంబంధించిన వివరాలను మాత్రం కంపెనీ బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం ఓపెనింగ్ Trust & Safety New Associate పొజిషన్ కోసం పడింది. అప్లై చేసుకునేవారికి కంటెంట్ మోడరేషన్ స్కిల్స్ అవసరమని వెల్లడించింది. ఈ పొజిషన్ కోసం ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తులు అర్హులుగా పేర్కొంది. ఇక పని అనుభవం విషయానికి వస్తే కనీసం ఏడాది లేదా అంతకంటే తక్కువ అనుభవం ఉన్నప్పటికీ సరిపోతుందని కంపెనీ వెల్లడించింది.

ఎంపికైన ఉద్యోగి రోల్ కింద ఏమి చేయాల్సి ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తే.. మారుతున్న క్లయింట్ విధానాలు, మార్గదర్శకాలను అర్థం చేసుకుని అప్డేటెడ్‌గా ఉండాలని పేర్కొంది. సంక్లిష్ట కంటెంట్ సమస్యలను విస్తృత ట్రస్ట్ అండ్ సేఫ్టీ పరిష్కరించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పాత్రలో సరైన అభివృద్ధి కోసం నిరంతర శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌గ్రూప్ చర్చలలో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికోసం అనేక మార్గాలు లేదా సోర్సెస్ నుంచి సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉండాలని కంపెనీ పేర్కొంది. అలాగే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తప్పనిసరిగా పేర్కొంది.
ఇదే క్రమంలో ఎంపికైన ఉద్యోగికి ఇంటర్నెట్, ఇంటర్నెట్ కల్చర్, ఇంటర్నెట్ ఫ్లాట్ ఫారమ్ లపై పూర్తిగా అవగాహన ఉండాలని, జరుగుతున్న ట్రెండ్ పరిశీలిస్తుండాలని పేర్కొంది. సంబంధిత మార్కెట్, ప్రాంతానికి సంబంధించి రాజకీయ సామాజిక పరిస్థితులపై పట్టు, సాంస్కృతిక అవగాహన అవసరమని కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో వ్యక్తిగతంగా అలాగే బృందంతో కలిసి పనిచేయటానికి అనుకూలంగా ఉండాలని కంపెనీ పేర్కొంది. కంపెనీ అవసరాలకు అనుగుణంగా రోజులో ఏ సమయంలోనైనా రొటేషన్ షిఫ్ట్స్ కింద పనిచేయటానికి సిద్ధంగా ఉండాలని వెల్లడించింది.
ఎంపికైనా వారు పని విషయంలో నాణ్యత, సామర్థ్యంతో పాటు నిబద్ధత కలిగి ఉండాలని స్పష్టం చేసింది. గతంలో ప్రాసెస్ ఔట్ సోర్సింగ్, కస్టమర్ సర్వీస్, కంటెంట్ మోడరేషన్ వంటి పని అనుభవం పరిగణలోకి తీసుకోబడుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ రోల్ ప్రధానంగా కెరీర్ ప్రారంభ స్థాయిలో ఉండే వ్యక్తులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఈ జాబ్ కి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications