SSY: నెలకు రూ.12,500 కడితే చాలు.. రూ.72 లక్షలు మీ సొంతం..!

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని కష్టపడతారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారిని చదివించడమే కాకుండా.. వారి పెళ్లి కోసం డబ్బులు పొదుపు చేస్తారు. ఆడ పిల్లల భవిష్యత్ బాగుండాలని కేంద్ర ప్రభుత్వం ఒక పొదుపు పథకాన్ని తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఇది కేవలం ఆడపిల్లకు మాత్రమే. ఇందులో మంచి వడ్డీ రేటు ఉంటుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు మీకోసం..

సుకన్య సమృద్ధి యోజన పథకంలో 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే భారీగా డబ్బులు వస్తాయి. ఈ పథకంలో సంవత్సరంలో కనీసం రూ.250 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా రూ.1,50, 000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ పథకంలో నెలకు రూ.12,500 చెల్లిస్తే భారీగా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో ఇద్దరు ఆడ పిల్లల వరకే అవకాశం ఉంటుంది. మూడో ఆడ పిల్ల ఉంటే పథకానికి అనర్హురాలు కాదు. బిడ్డ పుట్టినప్పటి నుంచి మీరు పెట్టుబడి పెట్టొచ్చు. పాప వయస్సు 21 సంవత్సరాల అయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. 18 ఏళ్ల తర్వాత కొంత మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు.

ssy

మీరు కుమార్తె పదేళ్ల వరకు ఈ పథకంలో చేరవచ్చు. మీరు మీ పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవాలంటే పోస్టాఫీస్ కు వెళ్లొచ్చు. లేదా బ్యాంకులో కూడా ఈ ఖాతా తెరవచ్చు. ఖాత తెరవడం కోసం పాప ఫొటో, ఆధార్, బర్త్ సర్టిఫికేట్, తండ్రి లేదా తల్లి ఆధార్, పాన్, ఫొటో కావాల్సి ఉంటుంది. ఒకరి పేరు మీద ఒకే ఖాత తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకంలో ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన సొమ్ము వస్తుంది. ఇందులో చక్ర వడ్డీ విధానంలో భారీగా రాబడి వస్తుంది.

మీరు నెలకు రూ.12,500 చొప్పున 15 ఏళ్లు పెట్టుబడి పెడితే కూతురు వయస్సు 21 సంవత్సరాలు వచ్చే వరకు భారీగా డబ్బులు వస్తాయి. మీరు నెలకు 12,500 పొదుపు చేస్తే సంవత్సరానికి రూ.1,50,000 పెట్టుబడి పెడతారు. 15 సంవత్సరాల్లో రూ. 22.50 లక్షలు అవుతుంది. మీకు రూ.71,82,119 వస్తాయి. ఈ పథకంలో రూ. 49 లక్షలు వడ్డీగా వచ్చినట్లు. ఇది పూర్తి ట్యాక్స్ ఫ్రీ. ఒక్క రూపాయి కూడా కట్ కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+