EPFO: వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవచ్చు..!
కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ కు సంబంధించి పలు సర్వీసులను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనేజేషన్ (ఈపీఎఫ్ఓ) మెంబర్లు తమ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలను వాట్సాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ 74వ పౌండేషన్ డే సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ఈ వాట్సాప్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. అలాగే నిష్క్రియగా ఉండి రూ.1000 బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిక్ సెటిల్మెంట్ను కూడా మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఇలాంటి ఖాతాదారులు తప్పని సరిగా ఆధార్, బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకుని ఉండాలి. ఇలా చేస్తే క్లయిమ్ కు దరఖాస్తు చేయకున్నా డబ్బులు వచ్చేస్తాయి.
ఇక వాట్సాప్ లో సేవలు పొందాలంటే...ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్ 8796441800కు సేవ్ చేసుకోవాలి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ద్వారా ఈ నంబర్ కు "Hi" లేదా "Hello" అని మెసేజ్ సెండ్ చేయాలి. ఈపీఎఫ్ఓ అధికారిక చాట్‌బాట్ నుంచి మెనూ కనిపిస్తుంది. యూఏఎన్ ఆధారంగా సాధారణ మొబైల్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. మొదటగా లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోమ్మని అడుగుతుంది. లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకున్న తర్వాత మెన్ వస్తుంది. ఇందులో పీఎఫ్ బ్యాలెనస్ చెక్, చివరి 5 పీఎఫ్ లావాదేవీలు, పాస్ బుక్ డౌన్ లోడ్ ఆప్షన్లు కనిపిస్తాయి.

మీరు పీఎఫ్ బ్యాలెన్స్ పై క్లిక్ చేస్తే కాసేపటి తర్వాత మీ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలిసిపోతుంది. చివరి 5 లావాదేవీలపై క్లిక్ చేస్తే చివరి 5 లావాదేవీలకు సంబంధించి సమాచారం కనిపిస్తుంది. పాస్ బుక్ డౌన్ లోడ్ పై క్లిక్ చేస్తే పాస్ బుక్ డౌన్ లోడ్ అవుతుంది. అయితే ఈ సర్వీసులు పొందాలంటే యుఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. దానికి లింకై ఉన్న మొబైల్ నంబర్ నుంచే మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ నంబర్ పూర్తి స్థాయిలో పని చేయడం లేదని తెలుస్తోంది. సమ్ థింగ్ వెంట్ రాంగ్ అని చూపిస్తున్నట్లు పలువురు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు షేరు చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications