EPFO WhatsApp: 8796441800కు హాయ్ అని పెట్టండి చాలు.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇట్టే తెలిసిపోతుంది..!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. వాట్సాప్ లో కొన్ని సేవలు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ సేవల్లో భాగంగా పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ యూఏఎన్ నంబర్ తో లింక్ అయి ఉన్న నంబర్ నుంచి వాట్సాప్ లో 8796441800కు హాయ్ లేదా హాల్లో అని సెండ్ చేయాలి. ఆ తర్వాత మీకు లాంగ్వెజ్ సెలక్ట్ చేసుకోవాలని వస్తుంది. మీరు ఇంగ్లీష్, హిందీ, తెలుగు పాటు పలు భాషాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు పై క్లిక్ చేస్తే తెలుగు భాషలో చాట్ ఓపెన్ అవుతుంది. మెను ఓపెన్ అవుతుంది. అందులో పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, పాస్ బుక్ డౌన్ లోడ్ ఆప్షన్లు ఉంటాయి.
మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెకే చేసుకోవాలనుకుంటే.. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు ఎంటర్ ఓటీపీ అని వస్తుంది. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు ఓటీపీ మెసేజ్ వస్తుంది. ఆ ఓటీపీని వాట్సాప్ లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కొన్ని సెకండ్లలో పీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇలానే మీరు పాస్ బుకు, చివరి 5 లావాదేవీలు తెలుసుకోవచ్చు. సాధారణంగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే.. ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్లాలి. లేదా 9966044425 మిస్ కాల్ ఇవ్వాలి. 7738299899 నంబర్ కు EPFOHO UAN నంబర్ ఎంటర్ చేసి మెసేజ్ చేయాలి. అప్పుడు మీకు వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

అయితే ఇప్పుడు ఉమాంగ్ యాప్ కు వెళ్లినా.. అది ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ రిడైరెక్ట్ అవుతుంది. వాట్సాప్ ద్వారా పలు ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే పీఎఫ్ లో క్లయిమ్ ను వాట్సాప్ ద్వారా చేసుకునే అవకాశం వస్తే ఇంకా బాగుంటుందని చందాదారులు కోరుతున్నారు. త్వరలో ఈ సేవలు కూడా వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కాగా త్వరలోనే పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే అవకాశం కల్పించే అవకాశం ఉంది. యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications