EPFO: ఉద్యోగులకు షాక్.. ఇక నెలనెల మీ జీతంలో రూ.6000 వేలు కట్..!

ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులు తమ పీఎఫ్ పొదుపు కోసం ఇకపై రూ. 3,000 (రూ. 25,000 వేతనంలో 12% వాటా) చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు కనీస వేతన పరిమితి రూ.15 వేలు ఇది రూ. 1,800గా ఉండేది. యజమానులు మరో 12 శాతం చెల్లిస్తారు. వారు రూ.3000 ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 3.7 శాతం అంటే రూ. 917 ఉద్యోగి పీఎఫ్ కు ఖాతాలోకి వెళ్తోంది. మిగిలిని 8.3 శాతం అంటే రూ.2,083 పెన్షన్ నిధికి వెళ్లనుంది. ఇంతకుముందు ఇది రూ. 1,250గా ఉండేది. మరో కోటి మంది కార్మికులను సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 17న EPFO ​​వేతన పరిమితిని పెంచింది.

ఉదాహరణకు నెలకు రూ. 20,000 వేతనం ఉన్న ఉద్యోగి విషయంలో తప్పనిసరి(కనీస వేతనంలో 12 శాతం) PF చందా రూ. 4800 ఉంటుంది (ఇందులో ఉద్యోగి వాటా రూ. 2,400, యజమాని వాటా రూ. 2400). ఒక ఉద్యోగి నెలకు రూ. 35,000 సంపాదిస్తుంటే కనీస వేతనంలో 12 శాతం తప్పనిసరి PF చందా రూ. 6,000 (ఉద్యోగి, యజమాని చెరో రూ. 3,000) అవుతుంది. అయితే ఇందులో పెన్షన్ (EPS)కు ఎటువంటి మొత్తం వెళ్లదు. ఎందుకంటే EPFO ​​వేతన పరిమితిని మించిన వేతనాలు ఉన్నవారికి EPS వర్తించదు. ఒక ఉద్యోగి జీతం రూ.25 వేలు అయితే అతని పీఎఫ్ చందా రూ.6000 అవుతుంది. ఉద్యోగి రూ.3 వేలు, యజమాని రూ.3 వేలు చెల్లించాలి. యజమాని చెల్లించిన రూ.3 వేలలో కొంత మొత్తం పెన్షన్ ఫండ్ కు వెళ్తోంది. ఇక్కడ కనీస వేతనం రూ.25 వేలు కాబట్టి ఇతనికి పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది.

PF

ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం తొలిసారి ఉద్యోగంలో చేరినపుడు ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి కన్నా జీతం (బేసిక్‌+డీఏ) ఎక్కువ ఉంటే పింఛను పథకానికి అర్హత ఉండదు. కనీస వేతనాన్ని బేసిక్ పే, డీఏ కలిపి లెక్కిస్తారు. బేసిక్, డీఏ కలిపి రూ.25 , అంతకన్నా ఎక్కువ జీతమున్న వారి జీతం పీఎఫ్ చందాగా రూ.6000 వెళ్తోంది. సాధారణంగా చాలా వరకు కంపెనీలు డబుల్ పీఎఫ్ ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తారు. యూజమాని చెల్లించాల్సిన రూ.30 వేలను కూడా ఉద్యోగి ఖాతా నుంచి కట్ చేస్తారు. అంటే కనీస వేతనం రూ.25 వేలు, అంతకు మించి ఉన్నవారి జీతంలో రూ.6 వేలు కట్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో మీకు పీఎఫ్ డబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

కనీస వేతన పరిమితి పెంచడం వల్ల ఉద్యోగికి వర్తించే ఇన్సూరెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈడీఎల్‌ఐ (బీమా) కనీసం రూ.10.50 లక్షలకు పెరుగుతుందని భావిస్తున్నారు. గతంలో ఇది రూ.7 లక్షలుగా ఉండేది. కొత్తగా చేరిన ఉద్యోగికి బేసిక్‌+డీఏ కలిపి రూ.25 వేలు దాటితే ఆ ఉద్యోగికి పింఛను పథకం వర్తించదని గుర్తించుకోవాలి. అయితే ఇప్పటికే ఈపీఎస్ ఉన్నవారు వారి జీతం పెరగడం వల్ల కనీస వేతనం రూ.25 వేల కంటే ఎక్కువ ఉన్నా ఈపీఎస్ వర్తిస్తుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+