PF: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఉచితంగా రూ.10 లక్షల బీమా..!
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి దాదాపు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఈ పీఎఫ్ ఖాతాలోకి నెలకు కొంత మొత్తం చెల్లిస్తారు. ఇందులో ఉద్యోగి వాటా, యాజమాన్యం వాటా ఉంటుంది. పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తానికి వడ్డీ చెల్లిస్తారు. పీఎఫ్ లో ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే పీఎఫ్ ఖాతా ఉన్నవారికి బీమా కూడా ఉంటుంది. ఇది చాలా మంది తెలియదు. బీమా ఉంది కాబట్టే పీఎఫ్ ఖాతాలో నామినీ యాడ్ చేయాలని చెబుతారు. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగి మరణించినట్లు అయితే రూ. 7 లక్షల వరకు ఉచిత బీమా పొందుతారు. ఈ ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఈ బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమ చేస్తారు.
పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి EDLI స్కీమ్ కింద ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కంపెనీలు ఉద్యోగి జీతంలో 0.5 శాతాన్ని ఈ బీమా నిధికి జమ చేస్తాయి. ఉద్యోగి సర్వీసులో ఉండగా అకాల మరణం చెందితే.. వారి కుటుంబ సభ్యులు లేదా నామినీ ఈ భీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. EPFO నిబంధనల ప్రకారం.. ఉద్యోగి మరణిస్తే నామినీకి కనీసం రూ.2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు భీమా మొత్తం లభించే అవకాశం ఉంది. EDLI పథకం కింద వచ్చే భీమా డబ్బును ఉద్యోగి చివరి 12 నెలల సగటు జీతం, పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి సగటు నెలవారీ జీతానికి 35 రెట్లు (గరిష్టంగా రూ. 15,000 బేసిక్ శాలరీ పరిమితితో), పీఎఫ్ ఖాతాలోని సగటు బ్యాలెన్స్‌లో 50 శాతాన్ని కలిపి లెక్కిస్తారు.

ఈ లెక్కల ప్రకారం నామినీకి గరిష్టంగా రూ. 7 లక్షల వరకు అందుతుంది. అయితే కేంద్రం తాజాగా పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. వేతన పెంపు వల్ల ఇన్సూరెన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈడీఎల్‌ఐ 2026 పథకం కింద బీమా మొత్తాన్ని ప్రస్తుతం రూ.15 వేల గరిష్ఠ పరిమితి ఆధారంగా లెక్కిస్తున్నారు. ఉద్యోగి మరణించినప్పుడు వారి గత 12 నెలల సగటు పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50% మొత్తాన్ని (గరిష్ఠంగా రూ.1.75 లక్షలు) బోనస్‌గా ఇస్తారు.
పాత పరిమితి కింద (రూ.15,000 × 35) + రూ.1.75 లక్షలు = రూ.7 లక్షలు కానుంది. కొత్త వేతన పరిమితి కింద (రూ.25,000 × 35) + రూ.1.75 లక్షలు = రూ.10.50 లక్షలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. వేతన పరిమితి పెంపు వల్ల నెలవారీ చేతికొచ్చే వేతనం కాస్త తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.15 వేల వేతన పరిమితిపై 12 శాతం చొప్పున ఉద్యోగి తన వాటాగా రూ.1800 చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రూ.25వేలపై రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేర నెలవారీ మీ చేతికొచ్చే జీతం రూ.1200 తగ్గనుంది. యాజమాన్యాలు కూడా తన బాధ్యతగా రూ.3వేలు జమ చేస్తాయి. అయితే విషయం ఏమిటంటే చాలా కంపెనీలు రెండు ఫీఎఫ్(ఉద్యోగి, యాజమాన్యం) చందాలను ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తున్నాయి. దీంతో ఉద్యోగి జీతంలో రూ.6 వేలు తగ్గే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
