EPFO: కనీస వేతన పరిమితి పెంపుతో పెరగనున్న పింఛన్..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సవరణ జరిగింది. ఈ నిర్ణయం వల్ల అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి EPFO పరిధిలోకి వస్తారని, తద్వారా కార్మికులకు సామాజిక భద్రత కవరేజీ విస్తృతమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనం పొందే కొత్త ఉద్యోగి స్వయంచాలకంగా EPF పరిధిలోకి రారు. దీనివల్ల వారు తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, సంబంధిత బీమా రక్షణ పరిధికి దూరంగా ఉండిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వేతన పరిమితిని రూ.25,000కు పెంచడంతో నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందే ఉద్యోగులు చట్టబద్ధమైన సామాజిక భద్రతా వ్యవస్థ పరిధిలోకి వస్తారని కేంద్రం తెలిపింది.
పీఎఫ్ వేతన పరిమితి పెంచడం వల్ల రిటైర్మెంట్ తర్వాత వచ్చే పింఛన్ కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) కింద అందే నెలవారీ పెన్షన్ ఏకంగా 67 శాతం వరకు పెరిగే అవకాశం భావిస్తున్నారు. ప్రాథమిక వేతనం రూ.25000 లేదా అంతకంటే ఎక్కువ ఉండి, కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అర్హులైన ఉద్యోగులకు పింఛన్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈపీఎస్ నిబంధనల ప్రకారం నెలవారీ పెన్షన్ లెక్కించేందుక ఒక నిర్దిష్ట ఫార్ములా ఉంటుంది. నెలవారీ పెన్షన్ = (పెన్షనబుల్ శాలరీ x పెన్షనబుల్ సర్వీస్)/ 70 అనే సూత్రం ఆధారంగా పింఛన్ ను లెక్కగడతారు.

ఇక్కడ పెన్షనబుల్ శాలరీ అంటే గత 60 నెలల సగటు బేసిక్ వేతనమని అర్థం. ఇది ఇప్పటి వరకు రూ.15000గా ఉండగా ఇప్పుడు అది రూ.25000లకు పెంచారు. అలాగే సర్వీస్ వ్యవధి 20 ఏళ్లు దాటితే 2 సంవత్సరాల అదనపు వెయిటేజీ సర్వీసుకు కలపనున్నారు. మీరు 20 పని చేస్తే దానికి రెండేళ్లు కలిపి 22 ఏళ్లుగా లెక్కిస్తారు. వేతన పరిమితి పెంపుతో కంపెనీ యాజమాన్యం చెల్లించే 12 శాతం విరాళంలో 8.33 శాతం భాగం ఈపీఎస్ పెన్షన్ ఫండ్‌కు వెళ్తున్న మొత్తం కాస్త పెరిగే అవకాశం ఉంది. పాత పరిమితిలో ఈపీఎస్ గరిష్ట విరాళం రూ.1250 ఉండగా.. కనీసం వేతనం రూ.25000లతో ఈపీఎస్ విరాళం రూ.2083 వరకు పెరగనుంది.
10 ఏళ్ల సర్వీస్ ఉంటే రూ.3,571 పింఛన్ వస్తుంది. 15 ఏళ్లు సర్వీస్ ఉంటే రూ.5,357, 20 ఏళ్లు పనిచేస్తే దానికి మరో రెండేళ్లు కలిపి 22 సర్వీస్ కాలానికి రూ.7,857 పింఛన్ రానుంది. 25 ఏళ్లు పని చేస్తే రెండేళ్ల కలిపి 27 సర్వీస్ కు రూ.9,643 పింఛన్ రానుంది. 32 ఏళ్ల సర్వీస్ కు రూ.11,429 ఫించన్ రానుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
