మెడికల్ ఇన్సూరెన్స్ ఈ కలంలో ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. అనుకోకుండా వైద్య ఖర్చులు ఎదురైనప్పుడు మన సేవింగ్స్ కాపాడుకోవడానికి ఇంకా ఆర్థికంగా దృడంగా ఉండడానికి మెడికల్ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది. ఈ కాలంలో చిన్న వయస్సులోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి నిపుణులు కూడా మీ 20 ఏళ్లలో ఆరోగ్య బీమా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. చాలా మంది కాలేజీ తర్వాత 20 ఏళ్లకే జాబ్ చేయడం ప్రారంభిస్తున్నారు. 20ఏళ్లకే డబ్బు సంపాదించడం పక్కన పెడితే అదే వయసులో ఉన్నప్పుడు వైద్య బీమా తీసుకోవడం చాలా ఉత్తమం అని కూడా చెబుతున్నారు. వైద్య బీమాని ప్రభుత్వ, ప్రయివేట్ కంపెనీలు కూడా అందిస్తున్నాయి. వీటిలో ప్రముఖంగా LIC కూడా ఒకటి. భారతీయ పౌరులు ఎవరైనా ఈ వైద్య బీమా తీసుకోవచ్చు. ఇందుకు మీరు ప్రతినెలా ఎంచుకున్న వైద్య బీమా ప్రకారం ప్రతినెలా కట్టాల్సి ఉంటుంది. వైద్య బీమా ప్రతిఒక్కరికి అందుబాటులో ఉండే ధరకే లభిస్తున్నాయి. మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా వర్తించే వైద్య బీమాని కూడా తీసుకోవచ్చు.
ఫైనాన్షియల్ ప్లానింగ్, డబ్బు ఎలా ఖర్చు చేయాలి, దేనికి డబ్బు కేటాయించాలి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోగల 20 ఏళ్లలోపు ఉన్న వారు కూడా బీమాపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పెట్టుబడి, సేవింగ్స్ గురించి ఆలోచిస్తారని బీమా గురించి ఆలోచించరని చెబుతుంటారు. కానీ కొందరు ఆరోగ్యంగా ఉన్నానంటే ఈ ఇన్సూరెన్స్ కారణమని భావించేవారూ కూడా ఉన్నారు. భారతదేశంలో గుండెపోటు వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరు 40 ఏళ్లలోపువారే. అలాగే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రతి నలుగురిలో ఒకరు 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. కొంతమందికి చిన్న వయస్సులోనే క్యాన్సర్ ఇంకా ట్యూమర్‌లతో తీవ్రమైన సమస్యలు ఎదురుకొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వైద్య బీమా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు మీ 20 ఏళ్లలోపే ఆరోగ్య బీమా తీసుకుంటే మీరు ఎంత చిన్నవారైన తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజ్ లభిస్తుంది. కొన్ని వ్యాధుల పై మరికొన్ని సంవత్సరాలలో అంటే మీ వయస్సు పెరిగేకొద్దీ అన్ని వ్యాధులకు, చికిత్సలకు బీమా పొందడం సాధ్యమవుతుంది. కొన్ని బీమా కంపెనీలు రెగ్యులర్ ప్రీమియం చెల్లింపుదారులకు ప్రీమియంలపై డిస్కౌంట్లు, ఫుల్ బాడీ చెకప్స్, హెల్త్ పాయింట్లను అందిస్తాయి. కాబట్టి మీరు మీ 20 ఏళ్లలో వైద్య బీమా తీసుకున్నప్పుడు హెల్త్ పై ఆలోచన కూడా వస్తుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications