ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారెంటీ పేరుతో కొత్త గృహ రుణ పథకాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. బిల్డర్ హామీ ఇచ్చిన నిర్దేశిత గడువులోగా ఇంటిని అప్పగించకుంటే కొనుగోలుదారుకు ప్రిన్సిపల్ మొత్తాన్ని రీఫండ్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు ద్వారా కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనం.

వినియోగదారుడికి ప్రయోజనం ఎలా?
ఈ పథకం వల్ల వినియోగదారుడుకి ప్రయోజనం జరగడం లేదా నష్టం జరగకపోవడం ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ప్రాజెక్టులో ఓ ఫ్లాట్ ధర రూ.2 కోట్లు ఉంటే కొనుగోలు చేసే వ్యక్తి ఆ ఫ్లాట్‌కు రూ.1 కోటి చెల్లించి బుక్ చేసుకుంటాడు. ఆ ప్రాజెక్టులో ఆలస్యం జరిగితే కస్టమర్‌కు రీఫండ్ వస్తుంది. చెల్లించిన మొత్తం రూ.1 కోటి వెనక్కి ఇవ్వాలి. బిల్డర్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ పొందే వరకు మాత్రమే ఈ రీఫండ్ పథకం వర్తిస్తుంది.

ఈ స్కీం సూపర్
ఎస్బీఐ తాజా స్కీంను అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనుజ్ పూరీ స్వాగతించారు. ఎస్బీఐ స్కీం చాలా మంచిదని, ఇది వినియోగదారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పాజిటివ్‌గానే మారుతుందన్నారు. ఈ స్కీం హోమ్ బయ్యర్స్‌ను అట్రాక్ట్ చేస్తుందని, అలాగే, వారికి ప్రయోజనం కలిగిస్తుందన్నారు. కాబట్టి రియల్ రంగానికి సూపర్ స్కీం అని అభిప్రాయపడ్డారు.

ఈ పథకం సక్సెస్..
ఈ స్కీం వల్ల ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని, రీఫండ్ చేసే పరిస్థితి రాకుండా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సమయానికి పూర్తి చేస్తే సదరు కంపెనీపై కస్టమర్లకు విశ్వాసం పెరుగుతుంది. లోన్ తీసుకునే వారిలో విశ్వాసం మరింతగా పెంచుతుంది. ఈ ప్రత్యేక పథకం సక్సెస్ కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఈ స్కీం ప్రత్యేకతలు
- గరిష్టంగా రూ.2.5 కోట్ల వరకు విలువైన ఇళ్ల కొనుగోలుకు ఈ పథకం కింద హోమ్ లోన్స్
- అర్హత కలిగిన బిల్డర్ల ప్రాజెక్టుల్లోని ఇళ్ల కొనుగోలుకు మాత్రమే ఈ రుణ పథకం కింద రుణాలు ఇస్తారు.
- అర్హత కలిగిన బిల్డర్ల ప్రాజెక్టులకు రూ.50 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు రుణాలు.
- ఈ స్కీం కింద SBI రుణ సౌకర్యం పొందిన బిల్డర్, ఆపరేషనల్ క్రెడిటార్ల నుంచి లోన్ పైన సేవలు పొందే అవకశముండదు.
- ప్రాజెక్టు ద్వారా బిల్డర్‌కు వచ్చే ఆదాయం అంతా ఎస్క్రో ఖాతాలో వేయాలి.
- మొదట దేశంలోని పది నగరాల్లో ఈ పథకం అమలు చేస్తారు. తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.

ఈ పథకం రక్షణ కల్పిస్తుంది..
SBI ఈ స్కీం హోమ్ బయ్యర్స్‌తో పాటు బిల్డర్లకు కూడా ప్రయోజనం కలిగిస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఇది భారత రియల ఎస్టేట్ రంగంపై బలమైన, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ముంబైలో ప్రారంభించిన ఈ పథకాన్ని క్రమంగా ఈ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. రేరా, జీఎస్టీ, నోట్లరద్దు వంటి అంశాల నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు సమయానికి ప్రాజెక్టులను అందించటంతో పాటు, వారి డబ్బులు నిలిచిపోకుండా ఈ కొత్త పథకం రక్షణ కల్పిస్తుందన్నారు. మొదట ముంబైలో సన్‌టెక్ డెవలపర్స్‌కు చెందిన మూడు ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఈ కొత్త హోమ్ లోన్ పథకాన్ని అందిస్తోంది. తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తుంది ఎస్బీఐ.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications