D Mart Vs Star Bazaar: స్టార్ బజార్, డీ మార్ట్.. ఎక్కడ ధరలు తక్కువగా ఉంటాయి..!
ఒకప్పుడు కిరాణా సామాన్లు కొనుగోలు చేయాలంటే.. కిరాణ షాపుకు వెళ్లేవాళ్లం. బట్టలు కావాలంటే బట్టల షాపుకు వెళ్లేవాళ్లం. చెప్పులు కావాలంటే చెప్పుల షాపుకు వెళ్లేవాళ్లం. బోళ్లు కావాలంటే బోళ్ల షాపుకు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇవన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి. దీంతో వినియోగదారులకు శ్రమ తప్పింది. సూపర్ మార్కెట్ల రాకతో అన్ని ఒక్క దగ్గర దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్లలో డీ మార్ట్, స్టార్ బజార్, మోర్, రియలన్స్ స్మార్ట్, రత్నదీప్, విశాల్ మెగా మార్ట్ వచ్చేశాయి. అయితే ఇండియాలో అందరికి సుపరిచితమైన పేరు డీమార్ట్.. డీ మార్ట్ స్టోర్లు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో డీమార్టు స్టోర్లు ఉన్నాయి. ఇందులో తక్కువ ధరలకు వస్తువులు దొరకడంతో ఇక్కడి ప్రజలు భారీగా వస్తున్నారు. అయితే డీ మార్ట్ లో తక్కువ ధరకు దొరుకుతాయా.. ఇతర సూపర్ మార్కెట్లలో తక్కువ ధరకు వస్తువులు రావా అని కొంత మందికి డౌట్ ఉండొచ్చు. అయితే డీ మార్ట్ తో పాటు స్టార్ బజార్ లో కూడా వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. స్టార్ బజార్ లో నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు కూడా విక్రయిస్తారు. డీ మార్ట్ లో దొరికే ధరలకే ఇక్కడ కూడా వస్తువులు అందుబాటులో ఉంటాయని కస్టమర్లు చెబుతున్నారు.

ఒక్కోసారి డీమార్ట్ కంటే స్టార్ బజార్ లోనే తక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. అయితే డీ మార్ట్ లో అనేక రకాల వస్తువులు.. అంటే దుస్తువులు, చెప్పులు, ఆట వస్తువులు ఉంటాయి. కానీ స్టార్ బజార్ లో ఇవి తక్కువగా ఉంటాయి. పైగా తెలుగు రాష్ట్రాల్లో స్టార్ బజార్లు చాలా తక్కువ. హైదరాబాద్ లో స్టార్ బజార్ స్టోర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఇక జిల్లాల్లో అందుబాటులో లేవు. కానీ డీ మార్ట్ స్టోర్లు సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. దీంతో వినియోగదారులు డీ మార్ట్ స్టోర్లకు ఎక్కువగా వెళ్తుంటారు. అయితే డీ మార్ట్, స్టార్ బజార్లలో తక్కువ ధరలు ఎందుకు ఉంటాయంటే.
సూపర్ మార్కెట్ల వారు డైరెక్ట్ గా తయారీదారుల నుంచి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఫలితంగా వారికి వస్తువు ధర తక్కువగా పడుతుంది. పైగా వీరు పేమెంట్ కూడా త్వరగా చేస్తారు కాబట్టి తయారీదారులు వీరికి తక్కువ ధరకే ఉత్పత్తులు విక్రయిస్తారు. సాధారణంగా ఒక చిన్న కిరాణ షాపు కు వెళ్లి వస్తువు కొంటే ఎమ్మార్పీ ధర తీసుకుంటారు. అదే హోల్ సెల్ వ్యాపారి వద్ద తీసుకుంటే రూపాయి లేదా రూ.2 తక్కువ చేస్తారు. అంటే ఇక్కడ వస్తువులు తయారీ దారు నుంచి డిస్ట్రిబ్యూటర్ కు వెళ్తాయి. అక్కడ నుంచి కిరాణా షాపులకు వెళ్తాయి. దీంతో వస్తువు ధర ఎక్కువగా మారుతుంది. అందుకే కిరాణా షాపుల్లో కంటే డీ మార్టుల్లో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications