Life Insurance: ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
ప్రస్తుత సొసైటీలో బీమా, పెట్టుబడికి మధ్య తేడా తెలియని వారు చాలా మంది. మనం ఎప్పుడైనా బీమా, పెట్టుబడిని వేరువేరుగా చూడాలి. కానీ చాలా మంది బీమాను పెట్టుబడిగా చూస్తారు. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా, పెట్టుబడి కలిపి పాలసీలను తీసుకొచ్చాయి. అయితే వీటి వల్ల పాలసీదారులకు నష్టమని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా బీమా, పెట్టుబడిని వేరుగా చూడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ తీసుకునేవారు రెండు విషయాలు తప్పకుండా గమనించాలి.
బీమా రెండు రకాలు ఉంటాయి. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రెండు బీమానే కానీ వీటిలో తేడా ఉంటుంది. చాలా మంది బీమా తీసుకునే వారు వారు కట్టిన డబ్బు తీరిగి రావాలి. ఎంతో కొంత ఎక్కువ రావాలని చూస్తారు. అలాంటి వారు ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అయితే దీని వల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెబుతున్నారు. ఇందులో డెత్ కవరేజ్ ఎక్కువగా ఉండుదు.. కానీ మనం చెల్లించిన మొత్తంతో పాటు కొంత లాభం కూడా వస్తుంది.

అందుకే ఎక్కువ మంది ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇదే కేవలం బీమా పథకం మాత్రమే. ఇందులో ఎలాంటి రాబడి ఉండదు. అయితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే డెత్ కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ మనం కట్టిన డబ్బులు వెనక్కు రావు. అయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించిన ప్రీమియం వెనక్కు చెల్లిస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మీ కుటుంబానికి భరోసా ఇవ్వాలనుకుంటే.. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు చూస్తున్నారు.
అంతేకానీ.. పెట్టుబడి, బీమా కలిపి ఉండే ట్రెడిషన్ పాలసీలో పెట్టుబడి పెట్టడం సరైందని కాదని సూచిస్తున్నారు. కుటుంబ ఆర్థిక భద్రతే మీ ముఖ్య లక్ష్యమైTEతే టర్మ్ బీమా ఇది అత్యంత సమర్థవంతమైన ఎంపికగా ఎంచుకోవచ్చు. పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని చెబుతున్నారు. ఇందులో రాబడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. బీమా టర్మ్ ఇన్సూరెన్స్, పెట్టుబడి కోసం అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications