FD Vs Mutual Fund: ఫిక్స్‌డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్..!
చాలా మంది భవిష్యత్ కోసం ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. కొంత మంది వాళ్ల పిల్లలకు డబ్బులు పొదుపు చేస్తారు. డబ్బులు పొదుపు చేయడానికి ఎక్కువగా పోస్టాఫీస్ పథకాలను ఎంచుకుంటారు. ఆ తర్వాతి కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారు. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బదులుగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచవల్ ఫండ్ల ఏది బెటరని చాలా మందికి సందేహాలు ఉన్నాయి.
ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది సురక్షితమైన పెట్టుబడి. దీనిపై కచ్చితమైన రాబడి ఉంటుంది. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై ఎంత డబ్బు వస్తుందో ముందు తెలుసుకోవచ్చు. దీనిలో మీరు ఒక నిర్దిష్ట కాలానికి ఒక నిర్దిష్ట మొత్తంలో డబ్బును పెట్టుబడి పెడతారు. మీ పెట్టిన పెట్టుబడిపై వడ్డీని పొందుతారు. రిస్క్ లేకుండా ఆదాయం తక్కువైనా ఫర్వాలేదు అనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

ఇక మ్యూచువల్ ఫండ్ల విషయానికొస్తే.. ఇవి రిస్క్ తో కూడున్నకున్నవి. దీనిలో కచ్చితమైన రాబడి ఉండదు. మీరు పెట్టిన పెట్టుబడికి సంబంధించి ఎంత వస్తుందో తెలియదు. అయితే కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్లలో ఎన్ని రోజులైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఎప్పుడైన డబ్బులను తీసుకోవచ్చు. రిస్క్ తీసుకునే వారికి మ్యూచువల్ ఫండ్లు మంచి ఎంకని నిపుణులు చెబుతున్నారు. ఇందులో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రిస్క్ ఉంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మార్కెట్ సంబంధం లేకుండా స్థిరమైన వడ్డీని పొందుతారు. కానీ మ్యూచువల్ ఫండ్లలో మార్కెట్ ను బట్టి రాబడి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలు నిర్వహిస్తాయి. మ్యూచువల్ ఫండ్లను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు నిర్వహిస్తాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై ఆర్పీఐ నిఘా ఉంటుంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలపై సెబీ నిఘా ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్లపై ట్యాక్స్ ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ పై టీడీఎస్ వర్తిస్తుంది. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై వడ్డీ సాధారణ పౌరులకు రూ.40,000 వేలు, ఆ పైన ఉంటే టీడీఎస్ కట్ అవుతుంది. సీనియర్ సిటీజన్స్ కు వడ్డీ రూ.50,000, ఆ పైన వడ్డీ ఉంటే టీడీఎస్ వర్తిస్తుంది. అయితే మీ ఆదాయం సంవత్సరానికి రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే టీడీఎస్ కట్ కాదు. ఇందుకు సాధారణ పౌరులైతే 15జీ, సీనియర్ సిటిజన్లు అయితే 15హెచ్ ఫామ్ సడ్మిట్ చేయాలి.
మ్యూచువల్ ఫండ్ల రాబడిపై కూడా ట్యాక్స్ ఉంటుంది. మీరు సంవత్సరం కంటే ఎక్కువ రోజులు పెట్టుబడి పెట్టి, దానిపై మీ రాబడి రూ.లక్ష ఉంటే.. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10 శాతం ట్యాక్స్ చెల్లించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications