ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త పీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మెసేజింగ్ అనువర్తనం వినియోగదారుల మారుతున్న, అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్స్ అందిస్తోంది. ప్రజలు ప్రయివేటుగా కనెక్ట్ అవ్వడానికి వేదికగా ప్రారంభమైన ఈ వాట్సాప్ ఇప్పుడు వివిధ రకాల ఇతర సేవలను కూడా అందుబాటులోకి తెస్తోంది.

కొత్త ఫీచర్ ఇదీ
ఇటీవల వాట్సాప్ కొత్త నిబంధనలతో వినియోగదారుల ఆగ్రహాన్ని చవిచూసినప్పటికీ, ఆ తర్వాత నుండి సరికొత్త ఫీచర్స్‌తో ముందుకు వస్తోంది. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను తెస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సప్‌లోని మీ ఛాట్స్‌ను బ్యాకప్ చేసే సమయంలో పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు. మళ్లీ చాట్స్‌ని రీస్టోర్ చేసే సమయంలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్ల ద్వారా పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోన్లలో సపోర్ట్
సరికొత్త ఈ ఫీచర్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌లోని చాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ వస్తోంది. పాస్‌వర్డ్‌ని సెట్ చేస్తే ఆ ఛాట్స్‌ని రీస్టోర్ చేయడానికి పాస్‌వర్డ్ తప్పనిసరి.
ఇప్పటికే వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్లకు వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్ ఫీచర్‌ను తీసుకు వచ్చింది. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ను కూడా మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు ఉన్న టైం 24 గంటలకు తీసుకు వస్తోంది. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయవచ్చు.

వాట్సాప్‌లో ఇతర ప్రయోజనాలు
వాట్సాప్ ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. పీడీఎఫ్, ఇమేజెస్, వీడియోలు డాక్యుమెంట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈమెయిల్, ఫైల్ షేరింగ్ యాప్స్ లేకుండానే ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. 100MB వరకు డాక్యుమెంట్స్ పంపించవచ్చు. కొన్ని గ్రూప్స్‌ను లేదా చాట్స్‌ను మ్యూట్ చేయవచ్చు. వాట్సాప్ సందేశాలను ఫార్మాట్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications