ఎంతోమంది యూజర్లు చాలాకాలంగా వేచిచూస్తున్న సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. గ్రూప్ చాట్స్, అలర్ట్స్‌తో విసిగిపోయే వారికి ఈ కొత్త అప్ డేట్ ఎంతో ఉపయోగకరం. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్స్‌ను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్‌తో ఎప్పటికీ మ్యూట్ చేసే సరికొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు వ్టాస్ప్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చు.

ఏడాది స్థానంలో ఆల్వేస్ మ్యూట్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని ఈ వాట్సాప్‌లో ఆల్వేస్ మ్యూట్ (ఎప్పటికీ మ్యూట్) ఆప్షన్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్‌లలో అందుబాటులో ఉంది. చాట్‌ను మ్యూట్ చేయడానికి 8 గంటలు, ఒక వారం, ఆల్వేస్ మ్యూట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇదివరకు ఆల్వేస్ మ్యూట్ స్థానంలో ఒక ఏడాది (ఇది గరిష్టం) ఉండేది. ఇప్పుడు ఏడాదికి బదులు ఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. 'ఇక నుండి మీరు ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చు' అని ట్వీట్ చేసింది.

ఎలా మ్యూట్ చేయాలి?
వాట్సాప్ ఓపెన్ చేశాక, మీరు ఏ గ్రూప్‌ను అయితే ఎప్పటికీ మ్యూట్ చేయాలని భావిస్తున్నారో ఆ గ్రూప్‌ను ఓపెన్ చేయాలి.
గ్రూప్ పేరు పైన ట్యాప్ చేయండి.
గ్రూప్ పేరుపై ట్యాప్ చేయగా.. గ్రూప్ పేరుకు క్రింద మ్యూట్ ఎంపిక ఉంటుంది.
అక్కడ మ్యూట్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఎనిమిది గంటలు, ఒకవారం, ఆల్వేస్ మ్యూట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఆల్వేస్ మ్యూట్ స్థానంలో ఏడాది ఉంది.
మీరు ఏది కావాలనుకుంటే దానిని ఎంచుకోవచ్చు.

నోటిఫికేషన్ రాదు
మీరు గ్రూప్‌ను మ్యూట్ చేసినప్పుడు ఏ నోటిఫికేషన్ రాదు. సందేశాలు, ఫోటోలు, జిఫ్ ఫోటోలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.
ఒకవేళ గ్రూప్‌లోని సమాచారం ఉపయోగపడుతుందని భావిస్తే అన్-మ్యూట్ చేయడం తెలిసిందే. అన్-మ్యూట్ చేయడానికి కూడా పై విధంగానే చేయాలి.

వాట్సాప్ బిజినెస్ ఫీచర్
ఇదిలా ఉండగా, వాట్సాప్ గురువారం బిజినెస్ యూజర్లకు నేరుగా ఈ ప్లాట్ ఫాం నుండి ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతించే మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా నేరుగా విక్రయించే వెసులుబాటు ఉంటుంది. ఫేస్‌బుక్ షాప్స్ అనే ఆన్‌లైన్ స్టోర్‌ను మే నెలలో ఫేస్‌బుక్ తీసుకు వచ్చింది. ఇప్పుడు వాట్సాప్ మెసెంజింగ్ యాప్ త్వరలో ఇన్-యాప్ కొనుగోళ్లు, హోస్డింగ్ సేవలను ప్రారంభించనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications