చనిపోయిన వ్యక్తి ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎం చేయాలి ?
సాధారణంగా ఎవరైనా చనిపోతే అతని స్మార్ట్ ఫోన్, బైక్ లేదా కార్ ఇలా ఏదైనా ఉంటే వాటిని మార్కెట్లో అమ్మేస్తుంటారు లేదా వారి జ్ఞాపకంగా అలానే ఇంట్లో పక్కన పెట్టేస్తుంటాం. మరి అలాంటప్పుడు చనిపోయిన వ్యక్తి ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఏం చేస్తారో తెలుసా...
ఎవరైనా చనిపోతే వారికీ సంబంధించినవి అన్ని తొలగిస్తారు. అలాగే కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు అతని ముఖమైన డాకుమెంట్స్ జాగ్రత్తగా పెట్టడం ముఖ్యం. ఇందులో ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఉంటాయి. అయితే ఈ డాకుమెంట్స్ ఉంచాలా లేదా సరెండర్ చేయాలా అనేది ముఖ్యం.

ఆధార్ కార్డ్ ఒక ప్రత్యేక గుర్తింపు నంబరుగా పనిచేస్తుంది. దీనిని LPG సబ్సిడీ, EPF అకౌంట్స్ వంటి సేవలకు లింక్ చేసి ఉంటుంది. యునిక్యు ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రస్తుతం మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును డియాక్టీవ్ చేయడం లేదా క్యాన్సల్ చేయడం అనుమతించదు. ఎందుకంటే UIDAI సిస్టమ్ స్టేట్ డెత్ రిజిస్ట్రీతో అనుసంధానించలేదు ఇంకా డెత్ రిజిస్ట్రీకి ఆధార్ అవసరం లేదు. మరణించిన వారి ఆధార్ దుర్వినియోగం కాకుండా UIDAI వెబ్‌సైట్ ద్వారా సంబంధిత బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా అతని వారసుల దగ్గర ఉంచుకోవచ్చు.
పాన్ కార్డ్, ఓటర్ ఐడి కూడా చాలా ముఖ్యం. ఏదైనా డబ్బు ట్రాన్సక్షన్స్ కోసం PAN కార్డ్ చాలా ముఖ్యమైనది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం ఇంకా అకౌంట్స్ క్లోజ్ చేయడం వరకు సేఫ్ గా ఉంచుకోవాలి. అవసరమైతే డెత్ సర్టిఫికెట్ కాపీతో పాన్‌ను సరెండర్ చేయవచ్చు.
ఓటరు ID క్యాన్సల్ కోసం ఫారం 7 అండ్ డెత్ సర్టిఫికెట్ కాపీతో లోకల్ ఎలక్షన్ ఆఫీస్ వెళ్లి చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఓటర్ లిస్ట్ నుండి మరణించిన వారి పేరును తీసేయొచ్చు. అలాగే ఒక వ్యక్తి మరణించిన తర్వాత పాస్‌పోర్ట్ సరెండర్ చేయడం లేదా క్యాన్సల్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ముగిసిన తర్వాత అతని పాస్‌పోర్ట్ చెల్లదు. ఇంకా ఒక వ్యక్తి మరణం గురించి ప్రభుత్వ అధికారులకు తెలియజేయకపోతే చట్టపరమైన ఎలాంటి జరిమానా ఉండదు.


Click it and Unblock the Notifications