For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Spot Gold and Gold Futures: స్పాట్ గోల్డ్, గోల్డ్ ఫ్యూచర్ అంటే ఏమిటి?

|

బంగారం ధర ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ ఇటు ఇన్వెస్టర్లను, అటు కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంటోంది. కరోనా సమయంలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపారు. మన ఆర్థిక అంశాల్లో బంగారం కీలక భాగస్వామిగా మారింది. డిమాండ్, సరఫరా, అంతర్జాతీయ పోకడలు, కరెన్సీ కదలికలు వంటి అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పెట్టుబడిదారు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫ్యూచర్ మార్కెట్, రెండు స్పాట్ మార్కెట్. వ్యాపారులకు ఈ రెండి మార్కెట్ల గురించి బాగా తెలుసు. కానీ చాలామంది ఈ రెండింటి మధ్య తేడాలను గుర్తించలేరు. అదేమిటో తెలుసుకుందాం.

స్పాట్ గోల్డ్ అంటే ఏమిటి?

స్పాట్ గోల్డ్ అంటే ఏమిటి?

స్పాట్ గోల్డ్ అంటే బంగారం పేరు కాదు.. ఇది ఓ వాణిజ్య ప్రక్రియ. స్పాట్ గోల్డ్ ఒక రకమైన వర్చువల్ బుక్ ట్రాన్సాక్షన్. ఫిజికల్ డెలివరీ ఉండదు. ఫిజికల్ బంగారం కాదు. పెట్టుబడిదారులు కేవలం ట్రేడింగ్ ద్వారా ధరల హెచ్చుతగ్గుల ద్వారా మాత్రమే లాభ,నష్టాలను పొందుతారు. కమోడిటీస్ స్పాట్ కాంట్రాక్ట్స్‌లో చెల్లింపు మరియు డెలివరీ వెంటనే ఉంటాయి. కమోడిటీస్ స్పాట్ ప్రైస్ కొనుగోలు చేయగల, చెల్లించిన, ప్రస్తుతం పంపిణీ చేయగల ధర.

గోల్డ్ ఫ్యూచర్ అంటే?

గోల్డ్ ఫ్యూచర్ అంటే?

వివిధ రకాల ఫ్యూచర్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ ఒకటి. గోల్డ్ ఫ్యూచర్ అనేది ఒక రకమైన ఫ్యూచర్ కాంట్రాక్ట్. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో భవిష్యత్తు తేదీల్లో బంగారం ధర ఉంటుంది. ఒక వస్తువు ఫ్యూచర్ కొనుగోలుదారు రాబోయే డెలివరీ కోసం ముందుగానే ధరను చూస్తున్నాడు. ఇక, మెచ్యూరిటీ వరకు ఈ ఫ్యూచర్‌ను హోల్డ్ చేయవచ్చు. డెలివరీ పొందవచ్చు. ఫ్యూచర్ సెటిల్మెంట్ ప్రతి నెల 5వ తేదీన ఉంటుంది.

కొనుగోలు, అమ్మకానికి అందుబాటులో

కొనుగోలు, అమ్మకానికి అందుబాటులో

మార్కెట్ డీలర్లు స్పాట్ బంగారంతో డీల్ చేస్తారు. ఇది పెట్టుబడిదారులకు ఏ క్షణంలో అయినా కొనుగోలు లేదా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మరోవైపు గోల్డ్ ఫ్యూచర్ మ్యాచ్ మేకింగ్ ట్రాన్సాక్షన్స్. స్పాట్ గోల్డ్ పరపతి నిష్పత్తి 1:100. డిపాజిట్ తర్వాత మీరు ఫస్ట్ హ్యాండ్ ట్రేడింగ్‌ను చేపట్టవచ్చు. గోల్డ్ ఫ్యూచర్‌కు ఎక్కువ మూలధనం అవసరం. తద్వారా రిస్క్ ఎక్కువ.

English summary

Spot Gold and Gold Futures: స్పాట్ గోల్డ్, గోల్డ్ ఫ్యూచర్ అంటే ఏమిటి? | What is spot gold and gold futures? Know the Difference

Gold Futures and gold spots are two fundamentally distinct investing options, as most gold traders are aware. Most investors, on the other hand, are unable to distinguish between the two investment approaches.
Story first published: Thursday, July 15, 2021, 16:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X