ప్రధాని నరేంద్రమోడీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ e-RUPIని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. క్యాష్-లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ పేమెంట్ విధానాల కంటే సరళమైన పద్ధతిలో క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ-రూపీ పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.
ఈ-రూపీ చెల్లింపులో నగదు ట్రాన్సాక్షన్స్‌ను క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్స్ ద్వార లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కు పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. ఈ వ్యవస్థను NPCI, ఆర్థికమంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేసింది.

ఏమిటీ ఈ-రుపీ... ప్రత్యేకత ఏమిటి?
నగదురహిత ట్రాన్సాక్షన్స్ కోసం NPCI కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఇది నేటి నుండి దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఈ-రుపీ చెల్లింపులో నగదు ట్రాన్సాక్షన్స్ క్యూర్ కోడ్ లేదా ఎస్సెమ్మెస్ స్ట్రింగ్ ఓచర్స్ ద్వారా లబ్ధిదారు మొబైల్ ఫోన్‌కు పంపిస్తారు. ప్రస్తుతం డిజిటల్ ప్రెమెంట్స్ యాప్స్ ద్వారా చేస్తున్నట్లుగానే ఉంటుంది. కానీ ఈ ఓచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. ఈ ఓచర్స్ ఈ-గిఫ్ట్ కార్డ్స్ వంటివి, ఇవి ప్రీపెయిడ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.

వాటికి మాత్రమే రిడీమ్
ఉదాహరణకు ఏదైనా ఓ ప్రత్యేక వస్తువు కొనుగోలు చేసేందుకు ఈ-రుపీ వోచర్స్ తీసుకుంటే ఆ వోచర్స్‌ను వాటికే ఉపయోగించాలి. ప్రెమేట్లు మొత్తం వోచర్స్ ద్వారా జరుగుతాయి. మనం చెల్లించవలసిన వారికి వోచర్ ఎస్సెమ్మెస్ చేయడం లేదంటే స్కాన్ చేయడం వంటివి చేయాలి. స్మార్ట్ ఫోన్ లేనివారు వోచర్ కోడ్ ఎస్సెమ్మెస్ చేస్తే సరిపోతుంది. ఈ వోచర్స్ నిర్దిష్టమైన వాటి కోసం ఉద్దేశించినవి.
బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్స్ ఉపయోగించవచ్చు. ఈ వోచర్లు ఎక్కువగా ఆరోగ్య సంబంధిత చెల్లింపుల కోసం ఉపయోగించబడతాయి. అంటే మెడిసిన్స్ కోసం తీసుకుంటే వాటి కోసం, కోవిడ్ 19 వ్యాక్సీన్ కోసం తీసుకుంటే దానికి మాత్రమే రిడీమ్ చేయాలి.

పేమెంట్స్ యాప్స్ కంటే భిన్నం
బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఈ వోచర్ ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యమైన తేడా. కార్పోరేట్లు తమ ఉద్యోగుల కొరకు ఈ వోచర్స్ జారీ చేయవచ్చు. వ్యాక్సీన్ ఈ-వోచర్ కోసం ఒక ఆప్షన్ తీసుకు వస్తామని కేంద్రం ఇదివరకు తెలిపింది. ఒక ప్రయివేటు ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కోసం ఈ వోచర్ కొనుగోలు చేయవచ్చు. అలాగే మరొకరికి బహుమతిగా ఇవ్వవచ్చు. వోచర్స్‌ను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి ఓచర్స్ వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు.

ఇలా రిడీమ్ చేసుకోవాలి..
వీటిని రిడీమ్ చేసుకోవడం సులభం. వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ సరిపోతుంది. NPCI ప్రకారం ఇప్పటికే ఎనిమిది బ్యాంకులు ఈ-ఆర్ యూపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications