For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Digital Gold అంటే ఏంటి..? బంగారంను ఆన్‌లైన్‌లో కొనుగోలు అమ్మకం ఎలా చేయాలి..?

|

బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా.. అయితే బంగారంపై ఎలా ఇన్వెస్ట్ చేయాలి.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు లేదా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ముందుగా డిజిటల్ బంగారం వైపు మొగ్గు చూపాలని విశ్లేషకులు చెబుతున్నారు. భారత దేశంలో పసిడికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. ఎందుకంటే బంగారం పై ఇన్వెస్ట్ చేస్తే ఆశించిన స్థాయిలో లాభాలు తప్పకుండా వస్తాయి. ప్రస్తుతం బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పసిడిపై పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు పన్నులు తదితర అంశాలను ఓసారి చూసుకోవాలి.

బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ముందుగా బంగారంను కొనుగోలు చేయడం, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బాండ్లు, బంగారు నాణేలు/ బంగారు బిస్కెట్లు, గోల్డ్ ఫండ్స్‌ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు తాజాగా డిజిటల్ గోల్డ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్నవారు డిజిటల్ గోల్డ్‌ను ఆశ్రయించొచ్చు. డిజిటల్ గోల్డ్ అంటే డిజిటల్ పద్దతిన లేదా ఆన్‌లైన్ రూపంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం. డిజిటల్ గోల్డ్‌ను ఆన్‌లైన్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్ల తరపున కొనుగోలు చేసి భద్రపరుస్తారు. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారంను ఆన్‌లైన్ ద్వారా ఎక్కడనుంచైనా చెల్లింపులు చేసి దాన్ని మీ వశం చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ కూడా ఇందుకోసం అందుబాటులో ఉన్నాయి.

What is Digital Gold,what is the procedure to buy and sell Gold online..?

బంగారం కొనుగోలు అమ్మకాలు ఈ డిజిటల్ యాప్స్ ద్వారా చేయొచ్చు. బంగారంను కొనుగోలు చేసి వెంటనే దాన్ని అమ్మాలనుకుంటే డిజిటల్ గోల్డ్ పద్ధతిని ఫాలో అవడం చాలా ఉత్తమం. చేతిలో బంగారం పెట్టుకుని దాన్ని అమ్మాలంటే సమయం వృధా కావడమే కాకుండా కాస్త కష్టమైన పని కూడా. అయితే డిజిటల్ గోల్డ్ ద్వారా బంగారంపై లావాదేవీలు చాలా సులభతరంగా జరపొచ్చు. డిజిటల్ పద్దతిన బంగారు కొనుగోలు చేస్తే అదే పద్ధతిలో చాలా సులభంగా కూడా అమ్మే అవకాశం డిజిటల్ గోల్డ్ ద్వారా లభిస్తుంది.

బంగారంను వెంటనే ఎలా కొనుగోలు/ అమ్మకం చేయాలి ..?

ముందుగా మనకు అందుబాటులో ఉన్న డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లకు వెళ్లి ముందుగా వాటిని డౌన్‌లోడ్ చేసుకోండి. లాగిన్ అయ్యాక ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి

1. రూపాయల్లో కానీ గ్రాముల్లో కానీ అంకెలను టైప్ చేయండి.

నోట్: మార్కెట్ రేటుకు అనుగుణంగా అప్పటికే ఉన్న ధరులు లేదా తూకం ప్రకారం బంగారంను కొనుగోలు చేయాలి

2.మీరు డబ్బులు ఎలా చెల్లిస్తారో ఎంపిక చేసుకోండి

నోట్: ముందుగా మీరు కేవైసీ వివరాలను పొందుపర్చాకే పేమెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి

3. డబ్బులు చెల్లిస్తే చాలు మీ బంగారం లాకర్‌లో భద్రంగా ఉంటుంది

నోట్: బంగారంకు సంబంధించిన మీ ఖాతా వెంటనే అప్‌డేట్ అవుతుంది. అంటే మీరు ఎంత బంగారం కొనుగోలు చేశారు, ఎన్ని గ్రాముల బంగారం కొనుగోలు చేశారనే అంశాలు అప్‌డేట్ అవుతాయి. దీనిపై ఎప్పుడూ మీకు యాక్సెస్ ఉంటుంది.

English summary

Digital Gold అంటే ఏంటి..? బంగారంను ఆన్‌లైన్‌లో కొనుగోలు అమ్మకం ఎలా చేయాలి..? | What is Digital Gold,what is the procedure to buy and sell Gold online..?

One of the newest ways to invest in gold is to buy digital gold. Gold is popular among Indians because it is not only one of the most prominent investment options, but it also provides good returns.
Story first published: Saturday, March 13, 2021, 16:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X