Blue Aadhaar: దేశంలోని ప్రజలకు ఆధార్ కార్డును భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందాలన్నా.. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో పనులు కావాలన్నా ఇది తప్పనిసరి.
12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన కార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బ్లూ ఆధార్ కార్డులను ప్రవేశ పెట్టింది. అయితే ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఐదేళ్ల లోపు పిల్లల కోసం తీసుకురాబడింది. కానీ ఐదేళ్లు నిండిన తర్వాత మాత్రం ఇది పనిచేయదు. సాధారణ ఆధార్ వినియోగదారుల మాదిరిగా వేలిముద్రలు, రెటీనా వివరాలు బ్లూ కార్డుల్లో 5 ఏళ్లు నిండిన తర్వాత పొందుపరిచి అప్‌డేట్ చేస్తారు.

పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు పొందటానికి తల్లిదండ్రులు అవసరమైన డాక్యుమెంట్లతో దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించాలి. కార్డును పొందేందుకు అడ్రస్ ప్రూఫ్, సదరు పిల్లల బర్త్ సర్టిఫికెట్ తమతో పాటు తీసుకెళ్లాలి. దరఖాస్తు ఫారమ్ తో పాటు సర్టిఫికెట్లను జతచేయాలి. తల్లిదండ్రుల ఆధార్ వివరాలతో పాటు మెుబైల్ నంబర్ వివరాలు జతచేయాలి. కార్డుపై ముద్రించేందుకు ఆధార్ కేంద్రంలో చిన్నారుల ఫోటోను తీస్తారు. అన్ని వివరాలు వెరిఫై చేసిన తర్వాత 60 రోజులలోపు బ్లూ ఆధార్ కార్డ్ జారీ అవుతుంది.
బ్లూ ఆధార్ ఉపయోగాలు : బ్లూ ఆధార్ కార్డును పిల్లలకు గుర్తింపు రుజువుగా వినియోగించవచ్చు. బ్లూ ఆధార్ కార్డు సహాయంతో పిల్లలు అర్హత కలిగిన ప్రభుత్వ సబ్సిడీ పథకాలను పొందవచ్చు. పిల్లలకు మధ్యాహ్న భోజన స్కీమ్ పొందటానికి ఈ బ్లూ ఆధార్ కార్డు ఉపయోగ పడుతుంది. నకిలీ-నిజమైన విద్యార్థుల వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ వివరాలను వినియోగించుకుంటుంది. అలాగే అడ్మిషన్ ప్రక్రియ కోసం తల్లిదండ్రులు బ్లూ ఆధార్ కార్డులను అందించాలని అనేక పాఠశాలలు పట్టుబడుతున్నాయి. పసిబిడ్డను నమోదు చేయడానికి తల్లిదండ్రులు హాస్పిటల్ డిశ్చార్జ్ స్లిప్ లేదా జనన ధృవీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications