Form 16: ITR ఫైలింగ్‌లో ఫారమ్ 16.. అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత, పూర్తి వివరాలు..
ITR News: పాత ఆర్థిక సంవత్సరం ముగిసి మూడు వారాలు కావస్తోంది. గత ఏడాదికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో వేతన జీవులు తలమునకలై ఉన్నారు. ఇప్పటికే కొందరు ఫైల్ చేయగా.. మరికొందరు ఫారమ్ 16 కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికీ చాలా మందికి ఈ ఫారమ్ 16 ప్రాముఖ్యత తెలియదు.
సాధారణ షెడ్యూల్ ప్రకారం ఆయా కంపెనీలు జూన్ 15కి ముందు తమ ఉద్యోగులకు ఫారమ్ 16ని జారీ చేస్తాయి. ఇందుకోసం ఆయా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడానికి జీతం పొందే వ్యక్తులు కనీసం 2 నెలల పాటు వేచి ఉంటారు. ఎందుకంటే ఫారమ్ 16 అనేది రిటర్న్‌లను దాఖలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగి తన వేతనం నుంచి చెల్లించిన ట్యాక్స్ వివరాలు ఇందులో ఉంటాయి.

ఫారమ్ 16లో రెండు భాగాలు ఉన్నాయి. ఒక ఉద్యోగికి సంబంధించి కంపెనీ ద్వారా కట్ చేయబడిన పన్ను వివరాలు ఫారమ్ 16-Aలో ఉంటాయి. ఇక ఫారమ్ 16-B ఉద్యోగి జీతం, తగ్గింపులు మరియు అదనపు ఆదాయం వంటి ఆర్థిక వివరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉద్యోగితో పాటు యజమాని వివరాలు కూడా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఓ వ్యక్తి ఆర్థిక పరిస్థితికి ఇది సమగ్ర రూపంగా భావించవచ్చు.
ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఫామ్ 16 తప్పనిసరి కాదు. అది లేకుండా కూడా ఫైలింగ్ ప్రాసెస్ చేయవచ్చు. కానీ దానిలో పూర్తి పన్ను చెల్లింపుకు సంబంధించి వివరాలు ఉండటంతో, ఆయా కంపెనీలు ఫారమ్ 16 ఇచ్చేవరకు ఎదురు చూడటం మంచిది. ఫారమ్ 16లో సమాచారాన్ని ఫారమ్ 26AS, AIS/TISతో సరిపోల్చుకోవాలి. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే సరిచేసుకోవాలి. కచ్చితమైన వివరాలతో ఫైలింగ్ చేస్తే అధికారుల తనిఖీ నుంచి తప్పించుకోవడమే కాకుండా రీఫండ్ వేగవంతం అవుతుంది.
ప్రభుత్వం పొడిగిస్తే మినహా ఓ ఆర్థిక సంవత్సరంలో ITRలు దాఖలు చేయడానికి జూలై 31ని చివరి తేదీగా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. జూన్ 15న కంపెనీ ఫారమ్ 16ను జారీ చేస్తే, పన్ను చెల్లింపుదారు తన పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి 45 రోజుల సమయం ఉంటుంది. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రత్యేక పోర్టల్‌ను సైతం ఏర్పాటు చేసింది. చివరి వరకు వేచి చూడకుండా సాధ్యమైనంత త్వరగా ఫైలింగ్ పూర్తిచేయాలని IT విభాగం కోరుతోంది.


Click it and Unblock the Notifications