For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం మంచిదేనా..? క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందా.. పెరుగుతుందా.

|

Multiple Credit Cards: ఒక వ్యక్తి ఎన్ని క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండవచ్చనే దానిపై సరైన సమాధానం లేదు. మీరు మీ క్రెడిట్ కార్డ్‌లతో జాగ్రత్తగా ఉంటే.. మంచి ప్రయోజనాలు ఉంటాయి. మరోవైపు, క్రెడిట్ కార్డ్‌లు ఆర్థిక కోణం నుంచి ప్రమాదకరమైనవి కావచ్చు. ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ, ఆర్థిక పరిస్థితులు తరచుగా వారు ఎన్ని క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండాలనే విషయాన్ని నిర్దేశిస్తుంటాయి. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం మీ క్రెడిట్ పరిమితిని మించి ఉంటే.. మీరు అనేక క్రెడిట్ కార్డ్‌లను నిర్వహించడం కష్టంగా ఉంటుంది. మీరు అదనపు కార్డ్‌ల కోసం దరఖాస్తు చేస్తే.. రిజెక్షన్ ఎదుర్కోవచ్చు.

ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం మంచిదేనా..?

ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం మంచిదేనా..?

కస్టమర్లను ప్రలోభపెట్టడాని, ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక బ్యాంకులు, కార్డ్ జారీ చేసేవారు తమ అత్యుత్తమ డీల్‌లు & తగ్గింపులను కొత్త కస్టమర్లకు తరచుగా అందిస్తాయి. ప్రతి ప్రయోజనం కోసం ప్రత్యేకమైన కార్డ్‌లను పొందడం తెలివైన పనిగా చెప్పుకోవాలి. వివిధ రకాల క్రెడిట్ కార్డులు వివిధ రకాల ఉత్పత్తులు, సేవలపై తగ్గింపులు, ఆఫర్లు, రివార్డులను అందిస్తుంటాయి. కాబట్టి అవసరాలకు అనుగుణంగా కార్డులను ఎంచుకోవటం మంచింది. కానీ ఈ రోజుల్లో కొన్ని కంపెనీలు అన్ని రకాల అవసరాల కోసం ఒకటే కార్డును జారీ చేస్తున్నాయి.

మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్ ఉండాలి?

మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్ ఉండాలి?

అసలు ఒక వ్యక్తి ఎన్ని క్రెడిట్ కార్డులను కలిగి ఉండవచ్చు అనే అంశంపై స్పష్టమైన సమాధానం లేదు. క్రెడిట్ కార్డ్‌ల సంఖ్యపై ఎలాంటి లిమిట్స్ లేవు. అలా అని.. అనేక క్రెడిట్ కార్డ్‌ల కోసం వేగంగా సైన్ అప్ చేయడం కూడా మంచిది కాదని గుర్తుంచుకోండి. ఈ ప్రవర్తన క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్‌లకు రెడ్ సిగ్నల్‌ను పెంచుతుంది. ఎందుకంటే మీరు మీ డబ్బును సరిగ్గా నిర్వహించలేరనడానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. మీ చర్యల వల్ల వారి ఆర్థిక స్థితికి అధిక ప్రమాదం ఉందని ఫైనాన్స్ కంపెనీ భావిస్తే.. వారు మీ ఖాతాను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అనేక క్రెడిట్ కార్డుల కోసం వెంటవెంటనే అప్లై చేస్తుంటే క్రెడిట్ రిపోర్ట్ విచారణల సంఖ్య మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయవచ్చు.

క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం..

క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం..

మీరు అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండటం వలన మీ క్రెడిట్ స్కోర్‌ పెంచవచ్చు. అనేక క్రెడిట్ ఖాతాలను విజయవంతంగా నిర్వహించడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీని మెరుగుపరచవచ్చు. మీరు తక్కువ బ్యాలెన్స్‌లతో అనేక క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉంటే.. మీ మొత్తం రుణం నుంచి క్రెడిట్ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ బాగా పెరగవచ్చు. అనేక కార్డులను పొందాలనుకోవటం కంటే.. ఉన్న కార్డ్ క్రెడిట్ లిమిట్ పెంచుకోవటం మంచిది. దీనిపై మీరు బ్యాంకులను సంప్రదించవచ్చు. బాధ్యతాయుతంగా ఉన్న క్రెడిట్ కార్డులను వినియోగించుకోగలిగితే.. వారి క్రెడిట్ హిస్టరీ పాజిటివ్ గా వృద్ధి చెందుతుంది. క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది.

క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు.. జాగ్రత్తలు..

క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు.. జాగ్రత్తలు..

అనేక క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండటం అనేక ప్రయోజనాలతో వస్తుంది. కానీ వాటిని తెలివిగా నిర్వహించక పోతేనే సమస్య. అనేక వేరియబుల్స్‌పై ఆధారపడి బహుళ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండటం తెలివైన ఆలోచన కాకపోవచ్చు. ప్రతి కార్డుకు పేమెంట్ తేదీలు, క్రెడిట్ పరిమితులను వినియోగదారుడు తప్పక గుర్తుంచుకాలి. అలాగే ప్రతి కార్డ్ అందించే ప్రయోజనాలను గుర్తుంచుకోండి. కార్డులు అందించిన పూర్తి లిమిట్ వాడకుండా.. 30 శాతం వరకు మాత్రమే వినియోగించుకోవటం చాలా ఉత్తమం. వాటి బిల్లులు పూర్తిగా సకాలంలో చెల్లించటం వల్ల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందుతారు.

English summary

Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం మంచిదేనా..? క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందా.. పెరుగుతుందా. | what are the advantages and bad impacts of having more credit cards by a user on his credit score

know about impacts of using more credit carads and its effect over cibil score
Story first published: Tuesday, June 28, 2022, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X