SBI కార్డు, ఫుల్ సర్వీస్ క్యారియర్ విస్తారా మంగళవారం రెండు ప్రీమియం కో-బ్రాండెడ్ కార్డ్స్‌ను లాంచ్ చేసింది. క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డు (Club Vistara SBI Card), క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ (Club Vistara SBI Card PRIME).. రెండు కార్డులను తీసుకువచ్చాయి. ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ అనుబంధ సంస్థ SBI కార్డ్. ఎస్బీఐ కార్డులో దీనికి 74 శాతం వాటా ఉంది.

అదనపు ప్రయోజనాలు
ఎస్బీఐ కార్డులో SBI బ్యాంకు వాటా 74 శాతం కాగా, 26 శాతం యూఎస్‌కు చెందిన ప్రయివేటు ఈక్విటీ ఫర్మ్ కార్లీల్ గ్రూప్‌ది. కాగా ఈ కార్డ్స్ ప్రాతిపదికన బెనిఫిట్స్ మారుతుంటాయి. ఈ కార్డులు తీసుకోవడం వల్ల సిల్వర్/బేస్ టైర్ మెంబర్‌షిప్, వెల్‌కమ్ టిక్కెట్స్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్, విస్తారా బుకింగ్స్‌పై ఫ్రీ క్యాన్సిలేషన్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ కార్డులకు ఏడాదికి ఎంత చెల్లించాలంటే?
- Club Vistara SBI Card PRIME పొందేందుకు ఏడాదికి రూ.2,999 చెల్లించాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) అదనం.
- Club Vistara SBI Card పొందేందుకు ఏడాదికి రూ.1,499 చెల్లించాలి. జీఎస్టీ అదనం.
- రెన్యూవల్ చేయించుకోవడానికి ఇవే ఛార్జీలు వర్తిస్తాయి.
- వీటిపై యాడ్ ఆన్ కార్డు ఉచితంగా పొందవచ్చు

రివార్డు పాయింట్స్
- PRIME కార్డు కలిగిన వారు విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటే ప్రతి రూ.100పై 9 క్లబ్ విస్తారా పాయింట్లు (CV) పొందుతారు.
- విస్తారా ఎయిర్ లైన్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది.
- PRIME కార్డు ఓనర్ యాన్యువల్ CV సిల్వర్ టైర్ మెంబర్‌షిప్‌ను కాంప్లిమెంటరీగా పొందుతారు. ఒక లాంజ్ యాక్సెస్ వోచర్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్ కూడా పొందుతారు.

విమాన టిక్కెట్ ఫ్రీ
- PRIME కార్డుపై ప్రీమియం ఎకానమీ కౌంటర్‌లో వెయిటింగ్ లిస్ట్ క్లియరెన్స్, ప్రియారిటీ ఎయిర్ పోర్ట్ చెక్, 5 కేజీల వరకు అదనపు చెకిన్ బ్యాకేజీ అలవెన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
- PRIME కార్డు మెంబర్ ఉచిత వన్ వే ప్రీమియం ఎకానమీ క్లాస్ టిక్కెట్ కూడా పొందవచ్చు. ఇది వెల్‌కమ్ గిఫ్ట్‌గా లభిస్తుంది. ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకున్న సమయంలో ఈ ప్రయోజనం ఉంటుంది.

టిక్కెట్ క్యాన్సిల్
- PRIME కార్డు హోల్డర్స్ ఆరుసార్లు టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సాధారణంగా క్యాన్సిలేషన్ పైన ఛార్జ్ ఉంటుంది. కానీ ఈ కార్డు హోల్డర్స్‌కు ఆరుసార్లు ఉచితం. విస్తారా వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు.

క్లబ్ విస్తారా.. ఎస్బీఐ కార్డు ప్రయోజనాలు
- Club Vistara SBI Card కలిగినవారు.. టిక్కెట్ బుకింగ్స్ ద్వారా ప్రతి రూ.100 ఖర్చు పైన 8 CV పాయింట్లు పొందుతారు.
- ఈ కార్డు కలిగిన వారికి 4 ఉచిత క్యాన్సిలేషన్స్ ఉంటాయి.
- ఇవి కాకుండా ట్రావెల్ ఇన్సురెన్స్ ప్రొటక్షన్, లాంగ్ యాక్సెస్ వోచర్, ప్రియారిటీ పాస్ ప్రోగ్రామ్ కాంప్లిమెంటర్ మెంబర్‌షిప్, ఆకర్షణీయ రివార్డులు ఉన్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications