udyogini yojana scheme: మహిళలకు గుడ్ న్యూస్.. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 లక్షల రుణం..!

మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనే పథకాలు తీసుకొస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. అంతే కాకుండా స్వయం సంఘాలకు పావల వడ్డికే రుణాలు అందిస్తున్నారు. కేంద్ర కూడా మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. ఈ పథకాల్లో ఒకటి ఉద్యోగిని యోజన పథక. ఈ పథకం కేవలం మహిళల కోసమే. చిన్న, చిన్న విధి వ్యాపారాలు చేసుకునే మహిళల కోసం ఈ పథకం తీసుకొచ్చారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర మహిళలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఏవరైనా మహిళలకు కిరణా షాపు లేదా కూరగాయలు అమ్మడం, లేడీస్ ఎంపోరియం పెట్టాలనుకుంటే ఈ పథకంలో భాగంగా లోన్ పొందవచ్చు.

బ్యాంకుల్లో మహిళలు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఈ రుణం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకంలో భాగంగా తీసుకునే రుణాలకు కేంద్రం 30 శాతం రాయితీ ఇస్తోంది. ఈ పథకంలో భాగంగా సాధారణ మహిళలకు 30 శాతం సబ్సిడీ రాగా.. షెడ్యూల్డ్ కులాలకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది. వితంతువులు, దివ్యాంగులకు ప్రత్యేక వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. టైలర్ షాపు, ఆహార పదార్థాలు, చేతివృత్తులు, చిన్న వ్యాపారులు చేసుకునే వారు ఈ లోన్ దరఖాస్తు చేసుకోవచ్చు. 88 రకాల వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు ఈ పథకంలో భాగంగా రుణాలు దరఖాస్తు చేసుకోవచ్చు.

ujyogini yojana

ఈ పథకంలో భాగంగా రుణం పొందాలంటే.. మహిళల వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. వారి వార్షిక ఆదాయం రూ.1,50, 000 మించకూడదు. షెడ్యూల్డ్ కులాలు, వితంతువులు, దివ్యాంగ మహిళలకు ఈ ఆదాయ పరిమితి నుంచి మినహాయింపులు ఇచ్చారు. లోన్ తీసుకునే మహిళ సిబిల్ స్కోర్ బాగుండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్, ఓటర్ ఐడీ, ఇన్‌కమ్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజు ఫొటో వంటివి ఉండాలి. ఇక వ్యాపారాన్ని సంబంధించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాలి. మహిళలు తమ సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్, పోర్టల్ ద్వారా ఈ పథకానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ పథకంలో భాగంగా సాధారణ మహిళలు రూ.3 లక్షల లోన్ తీసుకుంటే.. ఇందులో రూ.2, 10,000 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ఇక షెడ్యూల్డ్ కులాల వారు రూ.3 లక్షలు తీసుకుంటే.. ఇందులో రూ.1,50,000 తిరిగి చెల్లించాలి. అయితే మీ వ్యాపారం అంచనాను బట్టి రుణం మంజూరు చేస్తారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+