ఆధార్ వినియోగదారులకు UIDAI సదవకాశం.. జూన్ 14 వరకు ఆ సేవలు ఫ్రీ.. త్వరపడండి..
Aadhaar Updation: భారతదేశంలోని ప్రజలకు ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి గుర్తింపు సాధనంగా మార్చింది. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను దీనితో అనుసంధానించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి కావటంతో పాటు.. పదేళ్ల కిందట తీసుకున్న వాటిని అప్ డేట్ చేయటం తప్పనిసరి అని ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో యూఐడీఏఐ దేశంలోని ప్రజలకు ఒక సదవకాశాన్ని అందించింది.

ఆధార్ అప్‌డేట్..
ప్రస్తుతం దేశంలో గుర్తించిన పోస్టాఫీసులు, బ్యాంక్ బ్రాంచీలు లేదా కొన్ని ఆఫ్ లైన్ ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఆధార్ వివరాలను అప్ డేట్ చేయించుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే దీనికి వారు రూ.50 రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భారతీయ నివాసితులు తమ ఆధార్ వివరాలను జూన్ 14 వరకు మూడు నెలల పాటు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI బుధవారం ప్రకటించింది.

ఉచిత సౌకర్యం..
తాజాగా UIDAI ఆధార్ హోల్డర్లను వారి గుర్తింపు, చిరునామాను రుజువు చేసే పత్రాలను తిరిగి ధృవీకరించడానికి ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు తమ తాజా అడ్రెస్ వివరాలను ఉచితంగా ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా చేసుకోవచ్చు. ఈ క్రమంలో పోస్ట్ ఆఫీస్ వంటి ఫిజికల్ అప్‌డేట్ సెంటర్‌లు వివరాలను అప్‌డేట్ చేయడానికి రూ.50 వసూలు చేయడం కొనసాగుతుందని UIDAI పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సదుపాయాన్ని myAadhaar పోర్టల్ (myaadhaar.uidai.gov.in)లో ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.

ఒత్తిడి తెస్తున్న UIDAI..
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ & అప్‌డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. ఆధార్ నంబర్ హోల్డర్ కార్డు కోసం నమోదు చేసుకున్న తేదీ నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు పత్రాలను సమర్పించి కనీసం ఒక్కసారైనా ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వం వద్ద ప్రజల సమాచార ఖచ్చితత్వాన్ని పెంచుతుందని యూఐడీఏఐ పేర్కొంది. ఈ వివరాలను తిరిగి అప్ డేట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది.
ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన ఫిబ్రవరి 2023 నాటికి రూ.1,110 కోట్ల బడ్జెట్ అంచనాకు బదులుగా ఆధార్ జారీ చేసేందుకు యూఐడీఏఐ రూ.1,325.41 కోట్లను ఖర్చు చేసింది. ఇది బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications