Pancard news: మార్కెట్లోకి మరో తరహా ఆర్థిక మోసం.. మీ పాన్‌కార్డ్ సేఫ్ అవునో కాదో చెక్ చేసుకోండి..
loan frauds: ఈమధ్య ఎక్కడ చూసినా ఆర్థిక మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో నగదు కోసం దొంగతనాలు జరిగేవి. కానీ కాలం మారడంతో మొత్తం డిజిటల్ మయం అయిపోయింది. దాంతో ఇప్పుడు మన అవసరం లేకుండానే ఇతరులను బురిడీ కొట్టించి వారి పేరు మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తద్వారా సొమ్ము చేసుకుని బాధితులను నట్టేట ముంచుతున్నారు.
GST, ఇంటి అద్దె రసీదులకు సంబంధించిన భారీ మోసాలు ఇటీవల బయటపడ్డాయి. అయితే పాన్ కార్డుల దుర్వినియోగం కూడా ఇదే తరహాకి చెందినది. ఓ వ్యక్తి పాన్ కార్డు ఉపయోగించి బ్యాంకులు వంటి పలు ఆర్థిక సంస్థల్లో అతని ప్రమేయం లేకుండానే దుండగులు లోన్స్ దండుకుంటున్నారు. సదరు సంస్థ నోటీసులు పంపితే గానీ తమ పేరుపై ఒక రుణం ఉందనే విషయం బాధితులకు తెలియడం లేదు. తీరా అంతా అయిపోయాక లబోదిబోమంటున్నారు.

ఈ తరహా పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే లోన్ లో కీలక పాత్ర వహించే పాన్ కార్డుపై ఎటువంటి రుణాలు ఉన్నాయో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తనిఖీ చేసుకోవడానికి పలుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు బజార్, పేటీఎం వంటి సంస్థల ద్వారా తేలికగా పాన్ కార్డుపై ఉన్న లోన్స్ వివరాలు సరిచూసుకోవచ్చు.
ఇవే కాకుండా ఆదాయపన్ను శాఖ జారీ చేసే ఫారం 26A ఉపయోగించి కూడా పాన్ కార్డుపై ఉన్న లోన్లను చెక్ చేసుకోవచ్చు. అయితే సాధారణంగా అందరూ సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వివరాలు ట్రాక్ చేస్తుంటారు. ఒకవేళ పాన్‌కార్డ్ దుర్వినియోగమైందని నిర్ధారణ అయితే వెంటనే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ https://incometax.intelenetglobal.com/pan/pan.asp లో ఫిర్యాదు చేయడం మంచిది. తద్వారా ప్రభుత్వం తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications