అంతర్జాతీయ బ్యాంకు అనేది స్వదేశంతో పాటు విదేశాల్లో పని చేసే, అంతర్జాతీయ వినియోగదారులకు ఆర్థిక సేవలు అందించే ఆర్థిక సంస్థ. విదేశీ బ్యాంకులు తమ మాతృదేశ నిబంధనలతో పాటు ఆతిథ్య దేశ నిబంధనలు కూడా పాటించవలసి ఉంటుంది. విదేశీ బ్యాంకు శాఖలు ఇతర సబ్సిడీ శాఖల కంటే భారీ మొత్తంలో రుణాలుఅందించే సామర్థ్యం కలిగి ఉంటాయి.
బ్యాంకుల మూలధనంపై ఆధారపడి రుణాలు ఇస్తుంటాయి. భారత దేశంలో విదేశీ బ్యాంకుల ఉనికిపై ఆర్బీఐ విధానం రెండు ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ ప్రకారం మన దేశంలో 46 విదేశీ బ్యాంకులు (జూలై 14, 2020 నాటికి) ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారత్‌లోకి పెద్ద ఎత్తున FDIలు తరలి వస్తున్నాయి. భారత్‌లోని కొన్ని బెస్ట్ ఇంటర్నేషనల్ బ్యాంకులు చూద్దాం....

సిటీ బ్యాంకు
వరుసగా ఐదో సంవత్సరం 'బెస్ట్ బ్యాంక్ ఫర్ హై-నెట్-వర్త్ ప్యామిలీస్'గా సిటీ బ్యాంకును పేర్కొంది కిల్పింగర్స్ పర్సనల్ ఫైనాన్స్. హై-నెట్-వర్త్ క్లయింట్స్‌కు యాక్సెసబుల్‌గా ఉన్న బ్యాంకుల్లో టాప్‌లో నిలిచింది. భారత్‌లో ఫుల్ సర్వీస్ ఆన్-షోర్ ఫారెన్ బ్యాంకుగా సిటీ బ్యాంకు ఉంది. సిటీ బ్యాంకు భారత ముఖ్య కార్యాలయం ముంబైలో ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉంది.
ఇది న్యూయార్క్ కేంద్రంగా పని చేసే మల్టీ నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ బిజినెస్ సిటీ గ్రూప్‌కు అనుబంధ సంస్థ. ముంబైలో సిటీ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగులు చెన్నై, ముంబై, గురుగ్రాంలో ఉన్నారు. సిటీ బ్యాంకు ఇటీవల కీలక ప్రకటన చేసింది. భారత్‌లో 119 ఏళ్ల తర్వాత ఇప్పుడు భారత్ సహా పదమూడు ప్రాంతాల నుండి తరలుతున్నట్లు తెలిపింది.

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్‌లోని లండన్‌లో ఉంది. ఇది బ్రిటిష్ మల్టీ నేషనల్ బ్యాంకింగ్, అండ్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్. 70కి పైగా దేశాల్లో, 1200కు పైగా ఔట్ లెట్స్ ఉండగా, 87,000 మంది ఉద్యోగులు ఉన్నారు. భారత్‌లో ముంబైలో 1858లో ఈ బ్యాంకును మొదటిసారి ప్రారంభించారు. కోల్‌కతా, షాంఘై, హాంగ్‌కాంగ్‌లోను ప్రారంభమైంది.1862లో ఈ బ్యాంకు హాంగ్‌కాంగ్ డాలర్ బ్యాంక్ నోట్లను ప్రారంభించింది.

మరిన్ని బ్యాంకులు...
HSBC బ్యాంకు కూడా టాప్ 10 బెస్ట్ బ్యాంకుల్లో ఒకటి. యూకేకు చెందిన HSBC హోల్డింగ్స్ సబ్సిడరీ ఇది.ఫ్రాంక్‌రఫ్ట్‌కు చెందిన డచెస్ బ్యాంకుకు భారత్ సహా 58 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి. 5 లక్షల ఉద్యోగులు ఉన్నారు. మన దేశంలో 11వేల మంది ఉద్యోగులు, 18 బ్రాంచీలు ఉన్నాయి.
రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్, డీబీఎస్ బ్యాంకు, బార్క్‌లేస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ అండ్ కువైట్, దోహా బ్యాంకు వంటివి ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications