సురక్షిత, మంచి రిటర్న్స్ కోసం సాధారణ పౌరులు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్(FD)ని ఎంచుకుంటారు. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకొని వివిధ బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటు దిగ్గజం HDFC బ్యాంకు, బ్యంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సీనియర్ సిటిజన్స్‌కు అందించే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను పొడిగించాయి. అదే సమయంలో మరో ప్రయివేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ సీనియర్ సిటిజన్లకు వర్తించే గోల్డెన్ ఇయర్స్ FD స్కీంను అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. కరోనా నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో ఈ బ్యాంకులు స్పెషల్ FD స్కీంను సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తున్నాయి. వివిధ బ్యాంకుల్లో ప్రత్యేక FD రేట్లు...

SBI we care స్కీం
సీనియర్ సిటిజన్ల కోసం SBI బ్యాంకు We Care ప్రత్యేక డిపాజిట్ స్కీంను ప్రారంభించింది. అయిదేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితితో ఈ స్కీంలో డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు సాధారణంగా వర్తించే వడ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అదనంగా ఉంటుంది. రెగ్యులర్‌గా వర్తించే వడ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుతం, ఎస్బీఐ సాధారణ వడ్డీ రేటు అయిదేళ్ల కాలపరిమితిపై 5.4 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్ ప్రత్యేక FD స్కీంలో చేరితో 6.20 శాతం వడ్డీ ఉంటుంది.

HDFC సీనియర్ సిటిజన్ కేర్
HDFC బ్యాంకు HDFC సీనియర్ సిటిజన్ కేర్ పేరుతో స్పెషల్ FD స్కీంను సీనియర్ సిటిజన్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ సిటిజన్లకు సాధారణంగా ఇచ్చే వడ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్లు అదనంగా ఉంటుంది. ఈ స్కీం ద్వారా రెగ్యులర్ వడ్డీ రేటు కంటే 75 బేసిస్ పాయింట్లు అధికంగా అందిస్తోంది. ఈ డిపాజిట్స్ పైన వర్తించే వడ్డీ రేటు 6.25 శాతం.

బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ FD స్కీం
సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ FD స్కీం డిపాజిట్స్ పైన 100 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటును అందిస్తోంది. ప్రత్యేక FD పథకం కింద (అయిదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు) ఒక సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే, FDకి వర్తించే వడ్డీ రేటు 6.25 శాతం ఉంటుంది.

ICICI స్పెషల్ FD స్కీం
మరో ప్రయివేటు దిగ్గజం ICICI బ్యాంకు గోల్డెన్ ఇయర్స్ పేరుతో సీనియర్ సిటిజన్ ప్రత్యేక FD స్కీంను తీసుకు వచ్చింది. సాధారణ వడ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం ద్వారా అందించే ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 6.30 శాతంగా ఉంది.

ఇన్వెస్ట్ చేయవచ్చా అంటే
సాధారణ FD స్కీంలు సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేటు కంటే 50 బేసిస్ పాయింట్లు అదనంగా అందిస్తాయి. ఈ ప్రత్యేక FD స్కీంలు మాత్రం మరింత అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి. కాబట్టి సాధారణ వడ్డీ రేట్ల కంటే ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అయిదేళ్ల సుదీర్ఘ కాలం కోసం ఈ ప్రత్యేక FD స్కీంలలో అవసరమైతే తప్ప పెట్టాలని, లేదంటే అయిదేళ్ల కాలానికి లాక్ చేయడం సరైన ఆలోచన కాదని నిపుణుల మాట.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications