Mutual Fund: రూ.లక్షను రూ.2.8 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ ఇదే..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్నది. ఇందులో కచ్చితమైన రాబడి ఉండదు. అలాగే ఇది సురక్షితమైన పెట్టుబడి కాదు. కానీ దీర్ఘకాలంలో ఇందులో పెట్టుబడి మంచి రాబడి ఇచ్చినట్లు గణంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో మంచి రాబడి ఇచ్చిన లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏమిటో చూద్దాం.

మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్
మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ గడిచిన ఐదేళ్లో 22.88 శాతం రాబడి ఇచ్చింది. మీరు ఈ ఫండ్ లో ఐదేళ్ల క్రితం రూ.1 లక్షను ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు మీ డబ్బు రూ.2.8 లక్షలకు పెరిగి ఉండేది. ఈ ఫండ్ మిడ్-క్యాప్ స్టాక్‌ల్లో 80.86 శాతం, లార్జ్-క్యాప్ స్టాక్ ల్లో 19.14 శాతం పెట్టుబడి పెట్టింది. స్మాల్-క్యాప్ హోల్డింగ్స్ ఏవీ లేవు. ఈ ఫండ్ 93.37 శాతం డబ్బును ఈక్విటీలలో పెట్టుబడి పెట్టగా, 6.63% నగదు నిల్వలను కలిగి ఉంది. ఈ ఫండ్ ప్రధానంగా వన్97 కమ్యూనికేషన్స్, కోఫోర్జ్, కళ్యాణ్ జ్యువెలర్స్ లో పెట్టుబడి పెట్టింది.
ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్
ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ గడిచిన ఐదేళ్లలో 22.16 శాతం రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ 66.45 శాతం స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఈ ఫండ్ లోసాయి లైఫ్ సైన్సెస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఆదిత్య ఇన్ఫోటెక్ ప్రధానంగా పెట్టుబడి పెట్టింది. ఉన్నాయి.
ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్
ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ గడిచిన ఐదేళ్లలో 21.94 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ 64,9 శాతం మిడ్ క్యాప్ కంపెనీల్లో, 18.14 శాతం లార్జ్ క్యాప్ కంపెనీల్లో, 16.96 శాతం స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఈ ఫండ్‌లోని కీలక హోల్డింగ్స్‌లో బీఎస్ఈ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి.
బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్
బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ గడిచిన ఐదేళ్లలో 29.54 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ 77.12 శాతం స్మాల్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఈ ఫండ్ హోల్డింగ్స్‌లో శోభా, ఆర్‌ఈసీ, ఎస్‌బీఐఎన్ ఉన్నాయి.
నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్
నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ ఐదేళ్లలో 21.56శాతం రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ 68.50 శాతం మిడ్-క్యాప్ కంపెనీల్లో, 21.09 శాతం లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. స్మాల్ క్యాప్ కంపెనీల్లో 10.41 శాతం పెట్టుబడి పెట్టింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications