పాన్ కార్డ్ ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా వాడేసుకోవచ్చు.. ఇన్ని లాభాలా..
కొంతకాలం క్రితం ఆధార్ కార్డ్ తరువాత పాన్ కార్డ్ మెల్లి మెల్లిగా ఆధార్ తో పాన్ కార్డ్ అనుసంధానం ఇలా దేశంలో ఇవి ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. అయితే ఆధార్ ప్రతి భారతీయుడి గుర్తింపు కార్డులాగ ఉపయోగపడుతుంది. అంతేకాదు భారతీయులకి ముఖ్యమైన గుర్తింపు డాకుమెంట్స్ లో పాన్ కార్డ్ కూడా ఒకటి. ఇవి బ్యాంకులు, ప్రభుత్వ పథకాలు ఇంకా ప్రతి చోట ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు కొన్ని ప్రదేశాలలో PAN కార్డ్‌ని ఫోటో ID కార్డుగా కూడా ఉపయోగిస్తారు తెలుసా...
కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఒకరి ఆర్థిక లావాదేవీలను(financial transaction) ట్రాక్ చేయడానికి పాన్ కార్డు ఉపయోగిస్తారు. ఆదాయపు పన్ను శాఖ పాన్ నంబర్ సహాయంతో ఒక వ్యక్తి ఆదాయ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భారతదేశంలో ముఖ్యంగా పాన్ కార్డ్ వల్ల ఎం అవసరమో తెలుసా..

ఇండియాలో సంవత్సరానికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే లేదా ట్రాన్సక్షన్స్ చేసే ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలి. అందుకు పాన్ కార్డ్ చాలా అవసరం. పాన్ కార్డు ఉంటేనే ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. కొత్త అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కొన్నిసార్లు బ్యాంకులు పాన్ కార్డ్ అడుగుతాయి. మీరు 5 లక్షల కంటే ఎక్కువ విలువైన చేసే కార్ లేదా బైక్ లేదా వాహనం కొనాల్సి వస్తే లేదా మీ ప్రస్తుత వాహనాన్ని 5 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముతూన్నట్లయితే ఆ ట్రాన్సక్షన్ కోసం మీ పాన్ కార్డ్ వివరాలు తప్పనిసరి. పాన్ కార్డు ఇండియాలో ప్రతిచోటా ఉపయోగపడుతుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా పాన్ కార్డ్ వివరాలను అందించడం తప్పనిసరి.
రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు కొనేటప్పుడు పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా అందించాలి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు ఇంకా బాండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు పాన్ వివరాలను సబ్మిట్ చేయాలి. PAN కార్డ్ వివిధ ప్రదేశాలలో ఒక వ్యక్తి ఫోటో గుర్తింపు కార్డు ఇంకా వయస్సు గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది.
ఒక విధంగా చెప్పాలంటే ఓటర్ ID కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటి కోసం అప్లయ్ చేసేటప్పుడు పాన్ కార్డును గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు. మీరు విదేశాలకు వెళుతున్నట్లయితే ఇంకా ఇండియన్ కరెన్సీ విదేశీ కరెన్సీగా మార్చుకోవాలంటే అక్కడ పాన్ కార్డ్ వివరాలను అందించడం తప్పనిసరి. ఏదైనా హౌస్ లేదా ప్రాపర్టీని కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు పాన్ కార్డ్ వివరాలు అడుగుతారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి లోన్ పొందేటప్పుడు పాన్ వివరాలను అందించడం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంతవరకు పన్ను ఎగవేతతో సహా మోసాలను గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ పాన్‌ను ఉపయోగిస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా పాన్ కార్డ్ తీసుకోకపోతే మీరు ఏదైనా కొత్త ఉద్యోగి అయితే తీసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications