EPFO: పీఎఫ్ డబ్బులను ఏం చేస్తారో తెలుసా.. వాటిని ఎక్కడ పెట్టుబడి పెడతారో తెలుసా..!
ఈపీఎఫ్ఓ సంస్థ పీఎఫ్ చందాదారులు జమ చేసిన మొత్తాన్ని ఏం చేస్తారో చాలా మందికి తెలియదు. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల చందాను పెట్టుబడులు పెడుతుంది. అయితే ప్రభుత్వం బాండ్లు, కచ్చితమైన హామీ ఇచ్చే పెట్టుబడి సాధానాల్లో పెట్టుబడి పెడుతుంది. అయితే తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) త్వరలో తన నిధిని, జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి (NIIF) నిర్వహించే ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (AIFలు), SIDBI నిర్వహించే స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 పథకం ద్వారా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
ఈ రోజు జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)లో సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం, అధిక దీర్ఘకాలిక రాబడులను ఆర్జించడం లక్ష్యంగా ఆ సంస్థ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరానికి కొత్తగా వచ్చే నిధులలో వార్షిక AIF కేటాయింపులు 3 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వద్ద దాదాపు రూ. 30 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో 2024-25లో దాదాపు రూ. 3.36 లక్షల కోట్లుగా ఉన్నాయి.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ప్రకారం, AIF అనేది భారతదేశంలో ఒక ట్రస్ట్, కంపెనీ, పరిమిత బాధ్యత భాగస్వామ్యం లేదా బాడీ కార్పొరేట్ రూపంలో స్థాపించిన ఒక ప్రైవేట్‌గా సమీకరించి పెట్టుబడి సంస్థగా కొనసాగుతోంది. ఇది దేశీయ లేదా విదేశీ పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించి, వారి ప్రయోజనం కోసం ఒక నిర్దిష్ట విధానం ప్రకారం పెట్టుబడి పెడుతుంది. ఇదిమౌలిక సదుపాయాలు, MSMEలు, స్టార్టప్‌లలో పెట్టుబడి పెడుతుంది. అంతేకాదుగే దేశీయ, ప్రపంచ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను సమీకరించడానికి కేంద్రం AIFలకు ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు మూలధనాన్ని కేటాయించింది.
NIIF కింద ప్రభుత్వ-ఆధారిత నిధులు, SIDBI ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకాలు ప్రధాన కార్యక్రమాలలో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, థర్డ్-పార్టీ నిర్వహించే నిధులలో పెట్టుబడి పెట్టే SEBI-నమోదిత AIFలు , ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను NIIF నిర్వహిస్తుంది. దీని పెట్టుబడిదారులలో భారత ప్రభుత్వం, దేశీయ ఆర్థిక సంస్థలు, ప్రపంచ సంస్థాగత పెట్టుబడిదారులు, పెన్షన్ ఫండ్లు, బ్యాంకులు ఉన్నాయి. ఈక్విటీలో కూడా పీఎఫ్ లో కొంత భాగం పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications