EPFO: డిసెంబర్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం..!
ఒకప్పుడు పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే పీఎఫ్ ఆఫీస్ వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సి వచ్చేది. అప్పుడు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం కూడా లేదు. ఆ తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఆఫీస్ వెళ్లాల్సి వచ్చేంది. ఆ తర్వాత ఆన్ లైన్ పీఎఫ్ డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కూడా సింపుల్ చేశారు. తాజాగా వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, పాస్ బుక్, చివరి ఐదు లావాదేవీలు తెలుసుకునే అవకాశం కల్పించారు. పీఎఫ్ తన చందదారులకు ఇబ్బంది కలగకుండా అనేక మార్పులు చేసింది. అయితే ఆన్ లైన్ లో పీఎఫ్ క్లెయిమ్ చేసుకుంటే వారం నుంచి 10 రోజులు పడుతుంది.
అందుకే ఇప్పుడు ఈపీఎఫ్ఓ మరో భారీ సంస్కరణ తీసుకురాబోతుంది. అదే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకుని సౌకర్యాన్ని డిసెంబర్ నెలలో ఈపీఎఫ్ఓ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. యూపీఐకి సంబంధించి ట్రయల్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ట్రయల్స్ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. వచ్చే నెలలో లాంచ్ చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవడం చాలా సింపుల్ గా ఉండనుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను బ్యాంక్ అకౌంట్లోకి సెకన్లలోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని చెబుతున్నారు.

ఆ తర్వాత ఏటీఎం ద్వారా ఆ డబ్బును డ్రా చేసుకోవచ్చు. అక్టోబర్ 2025లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 3.0 ఫ్రేమ్‌వర్క్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఏడాదిలోగా దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. యూపీఐ విత్ డ్రా డిసెంబర్ లో ప్రవేశపెట్టినా.. ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు పీఎఫ్ అడ్వాన్స్ విత్ డ్రా గురించి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 75 శాతం వరకు డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 90 శాతం వరకు నిధులను ఉపసంహరించుకోవచ్చు.
ఈ నిర్ణయంతో పాటు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రిటైర్డ్మెంట్ తర్వాత పీఎఫ్ సొమ్మును నెల నెల విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అయితే కనీస పెన్షన్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం పింఛన్ రూ.1000 నుంచి రూ.3000 పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications