Aadhhaar: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, ఫొటో, మొబైల్ నంబర్, జెండర్ ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చంటే..!
ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఏ పనికైనా ఆధార్ అడుగుతున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడానికి, సంక్షేమ పథకాలు, చాలా వాటికి ఆధార్ సమర్పించాల్సి వస్తుంది. అయితే ఆధార్ ఆప్డేట్ కు సంబంధించి చాలా మంది కొన్ని నిబంధనలు తెలియవు. ఆధార్ ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు. అందులో పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, పుట్టిన తేదీ మార్చవచ్చా, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో చాలా మందికి తెలియదు. అయితే ఊడాయ్ నిబంధనలకు ప్రకారం కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కొంత మంది ఆధార్ లో పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది. వారు పేరును అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మహిళలు పెళ్లి అయి అత్తవారింటికి వెళ్తారు. అప్పుడు వారు కూడా ఇంటి పేరు మార్చుకోవాల్సి వస్తుంది. వారు కూడా పేరు అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ పేరు అప్డేట్ చేసుకోవడానికి పరిమితులు ఉన్నాయి. అందుకే పేరు అప్డేట్ చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఉడాయ్ నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డులో పేరును కేవలం రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి అప్డేట్ చేసుకోవడానికి వీల్లేదు. మీరు ఆధార్ కార్డులో పేరు అప్డేట్ చేసుకోవాలంటే కొన్ని పత్రాలు సమర్పించాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే.. మీ టెన్త్ మెమో సమర్పించాలి. చదువుకోనివారు డే ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

ఇక ఇంటి పేరు మార్చుకోవాలంటే.. మీ మ్యారేజ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఆధార్ కార్డులో పుట్టిన తేదీ కూడా మార్చుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు. మీరు ఎన్నిసార్లు అయిన సరైన పత్రాలు సమర్పించి ఆధార్ లో డే ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డులో జెండర్ ను కూడా మార్చుకోవచ్చు. ఒక ఆధార్ కార్డులో ఒక్కసారి మాత్రమే జెండర్ మార్చుకోవడానికి ఉడాయ్ అవకాశం కల్పించింది. ఇక ఆధార్ కార్డులో అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా ఆధార్ లో అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఫోన్ నంబర్ కూడా ఎన్నిసార్లు అయినా ఆధార్ లో అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ లో ఫొటోను కూడా ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ కు సంబంధించి కొన్ని ఫ్రీ సర్వీసులు ఉన్నాయి. మీరు ఆన్ లైన్ లేదా ఆధార్ యాప్ లో అడ్రస్ అప్ఢేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ యాప్ ద్వారా ఫోన్ నంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ యాప్ ద్వారా మీ మెయిల్ ఐడీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ సర్వీస్. బయోమెట్రిక సంబంధించి ఐదేళ్ల తర్వాత పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ చేయించాలి. పిల్లలు పుట్టిన తర్వాత బాలా ఆధార్ ఇస్తారు. అప్పుడు బయోమెట్రిక్ తీసుకోరు. ఐదేళ్ల తర్వాత ఆధార్ అప్డేట్ చేయించాలి. అప్పుడు ఐరీష్, బయోమెట్రిక్ తీసుకుంటారు. పిల్లలకు 18 ఏళ్ల నిండిన తర్వాత ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఇక సాధారణ ప్రజలు 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications