EPFO: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. చేతికొచ్చే జీతం భారీగా తగ్గనుంది..!

కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ గురించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కనీస వేతన పరిమితిని కేంద్ర రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. ఇలా పెంచడం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయినప్పటికీ.. వారికి చేతికి వచ్చే జీతం డబ్బులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కనీస వేతన పరిమితి రూ.15 వేలు ఉంది. ఇందులో 12 శాతం పీఎఫ్ చందాగా కట్ అవుతుంది. ఉగ్యోగి 12 శాతం, యాజమాన్యం 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగి జీతంలో రూ.1800 కట్ అవుతాయి. తాజాగా వేతన పరిమితి రూ.25 వేలకు పెంచారు. ఇప్పుడు రూ.25 వేలలో 12 శాతం అంటే.. రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగి జీతంలో రూ.3 వేలు కట్ అయి వస్తుంది. ఉదాహరణకు ఓ ఉద్యోగికి జీతం రూ.25 వేలు అనుకుంటే.. ఆయన జీతంలో రూ.3 వేలు కట్ అవుతాయి. అంటే అతని చేతికి రూ.22 వేలు మాత్రమే వస్తాయి. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి జీతం నుంచి 50 శాతం, యాజమాన్యం 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలా కంపెనీలు ఉద్యోగి జీతం నుంచి డబల్ పీఎఫ్ కట్ చేస్తున్నాయి. ఈ లెక్కన ఉద్యోగి చేతికి వచ్చే జీతం భారీగా తగ్గే అవకాశం ఉంది. పై ఉదాహరణ చూసుకున్నట్లయితే.. రూ.25 వేలు ఉన్న ఉద్యోగి జీతంలో రూ.6 వేలు కట్ అవుతాయి. అంటే ఉద్యోగికి రూ.19 వేలు మాత్రమే చేతికి వచ్చే అవకాశం ఉంది.

PF

వేతన పరిమిత వల్ల ఉద్యోగులకు కొన్ని ప్రయోజనాలు వచ్చే అవకాశం. EDLI స్కీమ్ కింద వచ్చే బీమా పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం కింద ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కంపెనీలు ఉద్యోగి జీతంలో 0.5 శాతాన్ని ఈ బీమా నిధికి జమ చేస్తాయి. ఉద్యోగి సర్వీసులో ఉండగా అకాల మరణం చెందితే.. వారి కుటుంబ సభ్యులు లేదా నామినీ ఈ ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. EPFO నిబంధనల ప్రకారం.. ఉద్యోగి మరణిస్తే నామినీకి కనీసం రూ.2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు భీమా మొత్తం లభించే అవకాశం ఉంది. EDLI పథకం కింద వచ్చే బీమా డబ్బును ఉద్యోగి చివరి 12 నెలల సగటు జీతం, పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి సగటు నెలవారీ జీతానికి 35 రెట్లు (గరిష్టంగా రూ. 15,000 బేసిక్ శాలరీ పరిమితితో), పీఎఫ్ ఖాతాలోని సగటు బ్యాలెన్స్‌లో 50 శాతాన్ని కలిపి లెక్కిస్తారు.

ఈ లెక్కల ప్రకారం నామినీకి గరిష్టంగా రూ. 7 లక్షల వరకు అందుతుంది. అయితే కేంద్రం తాజాగా పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. వేతన పెంపు వల్ల ఇన్సూరెన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈడీఎల్‌ఐ 2026 పథకం కింద బీమా మొత్తాన్ని ప్రస్తుతం రూ.15 వేల గరిష్ఠ పరిమితి ఆధారంగా లెక్కిస్తున్నారు. ఉద్యోగి మరణించినప్పుడు వారి గత 12 నెలల సగటు పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50% మొత్తాన్ని (గరిష్ఠంగా రూ.1.75 లక్షలు) బోనస్‌గా ఇస్తారు. పాత పరిమితి కింద (రూ.15,000 × 35) + రూ.1.75 లక్షలు = రూ.7 లక్షలు కానుంది. కొత్త వేతన పరిమితి కింద (రూ.25,000 × 35) + రూ.1.75 లక్షలు = రూ.10.50 లక్షలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+