SBI Funds Management IPO: గ్రే మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు..!
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ ఈ రోజు ప్రారంభం అయింది. ఐపీఓ జూలై 16న ముగియనుంది. ఈ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.9,795 కోట్లను సేకరించనున్నారు. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.545-574 గా నిర్ణయించారు. ఒక లాట్ లో 26 షేర్లు వస్తాయి. పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం ఒక లాట్ కు బిడ్ వేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ఇష్యూకు ముందు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,663 కోట్లను సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ వచ్చింది. అంతర్జాతీయ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.574 లకు కేటాయించారు. యాంకర్ పెట్టుబడిదారులకు 4,63,93,095 ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లో పెట్టుబడి పెట్టిన యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాలో జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, క్యాపిటల్ వరల్డ్ ఇన్వెస్టర్స్, బ్లాక్ రాక్, ఫిడిలిటీ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్, గోల్డ్ మన్ సాక్స్ అసెట్ మేనేజ్ మెంట్, నార్జెస్ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి.

ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓలో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు గరిష్టంగా 50 శాతం, సంస్థాగతేతర పెట్టుబడిదారులకు 15 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు కనీసం 35 శాతం కేటాయించారు. ఉద్యోగులకు కూడా ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.54 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఓపీఓలో జూలై 17 షేర్ల కేటాయింపు ఉంటుంది. జూలై 20, సోమవారం నాడు రీఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజున షేర్లు కేటాయింపుదారుల డీమాట్ ఖాతాల్లో షేర్లు జమ చేస్తారు. జూలై 21 మంగళవారం నాడు SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు లిస్ట్ కానున్నాయి. ఈ ఎస్బీఐ ఫండ్ మేనేజ్ మెంట్ కంపెనీని 1987లో స్థాపించారు. ఇది త్రైమాసిక సగటు నిర్వహణ ఆస్తుల పరంగా దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) కంపెనీగా ఉంది. 2026 మార్చి 31 నాటికి ఇది రూ.12.51 లక్షల కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ QAAUMను నిర్వహిస్తోంది.
మంగళవారం ఎస్భీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ జీఎంపీ ప్రీమియంలో ట్రేడవుతోంది. గ్రే మార్కెట్‌లో ఈ షేర్లు రూ.100 ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. ఈ ఐపీఓ రిజనబుల్ వాల్యూవేషన్ లో వస్తున్నట్లు చెబుతున్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ఏఎంసీ కంటే తక్కువ వాల్యూవేషన్ వస్తున్నట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications