EPFO: బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్లో ఉద్యోగుల జీతాలు తగ్గే అవకాశం..!
కేంద్ర ప్రభుత్వం కనీస వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. 2014 సెప్టెంబర్ కనీస వేతన పరిమితిని రూ.15 వేలు చేశారు. దీని ప్రకారం 2014 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారి బేసిక్ శాలరీ ప్లస్ డీఏ కలిపి రూ.15 ఉన్నవారు మాత్రమే పెన్షన్ కు అర్హత సాధిస్తారు. రూ.15 వేల కంటే ఎక్కువ బేసిక్ శాలరీ ప్లస్ డీఏ ఉన్నవారు పెన్షన్ పొందలేరు. అయితే ఇప్పుడు కనీస వేతన పరిమితి రూ.25 వేలకు పెంచడంతో మొదటిసారి ఉద్యోగంలో చేరినవారి జీతం(బేసిక్ ప్లస్ డీఏ) రూ.25 వేలు, అంత కంటే తక్కువ ఉంటే పెన్షన్ కు అర్హత సాధిస్తారు.
రూ.25 వేల కంటే ఎక్కువ శాలరీ(బేసిక్ ప్లస్ డీఏ) వస్తే వారికి పెన్షన్ ఉండదు. ఇప్పుడు రూ.25 వేలు కనీస వేతన పరిమితి పెంచడంతో చాలా మంది పెన్షన్ కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు బేసిక్ శాలరీ రూ.25 వేలు ఉన్నవారు పెన్షన్ కు అర్హత సాధిస్తారు. అయితే మొదటి సారి ఉద్యోగంలో చేరినప్పుడు బేసిక్ సాలరీ రూ.25 వేలు ఉండి.. ఆ తర్వాత జీతం పెరిగినా వారు పెన్షన్ పథకంలో కొనసాగుతారు. కంపెనీలు ఇచ్చే పెన్షన్ వాటా గరిష్ట పరిమితి గతంలో రూ.1,250 ఉండేది, ఇప్పుడు రూ.2,083 వరకు పెరుగుతుంది. ఒకవేళ మొదటి ఉద్యోగంలోనే బేసిక్ రూ.25 వేల కంటే ఎక్కువ ఉంటే, ఆ ఉద్యోగికి ఈపీఎస్ ఇవ్వడం కంపెనీకి తప్పనిసరి కాదు. అప్పుడు సంస్థ వాటా మొత్తం కేవలం ఉద్యోగి ఈపీఎఫ్‌కే జమ అవుతుంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ) తెచ్చిన ఈ కొత్త రూల్ సెప్టెంబర్ నెల మధ్యలో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగుల జీతాల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క నెల జీతాన్ని రెండు భాగాలుగా లెక్కించనున్నారు. మొదటి 16 రోజులు (సెప్టెంబర్ 1-16) వరకు పాత పద్ధతి ప్రకారమే లెక్కిస్తారు. చివరి 14 రోజులను (సెప్టెంబర్ 17-30) కొత్తగా మారిన రూ.25 వేల పరిమితి ప్రకారం లెక్కించనున్నారు. ఉద్యోగి ఇప్పటికే ఈపీఎస్‌లోకి చేరితే అతని బేసిక్ శాలరీ నెలకు రూ.30 వేలు, రూ.50 వేలు లేదా రూ. లక్ష ఉన్నా సరే.. గరిష్ట సీలింగ్ అయిన రూ.25 వేలపై కంపెనీ వాటా అయిన 2,083 రూపాయలు ఉద్యోగి ఈపీఎస్ ఖాతాలో జమ అవుతుంది.
రూ.25,000 దాటిన మిగిలిన మొత్తంపై కంపెనీ చెల్లించాల్సిన వాటా ఆటోమేటిక్‌గా పీఎఫ్ (ఈపీఎఫ్) ఖాతాకే వెళ్లనుంది. బేసిక్ రూ.25 వేలు దాటినంత మాత్రాన కంపెనీ నుంచి ఈపీఎస్ జమ ఆగిపోదని గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ నెలలో ఉద్యోగి చేతికొచ్చే జీతంలో తేడాలు వచ్చే అవకాశం ఉంది. కాగా పలు సంస్థలు డబల్ పీఎఫ్ ఉద్యోగి జీతం నుంచే కట్ చేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం విధానం ప్రకారం ఉద్యోగి జీతంలో దాదాపు రూ.6 వేలు కట్ అయి రావచ్చు. జీతాలకు సంబంధించి ఉద్యోగులకు కంపెనీలు ఇప్పటికే మెయిల్స్ పంపాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
