PF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక ఎన్నిసార్లైనా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..!
ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఈ ఖాతాలోకి నెలకు కొంత జమ చేస్తుంటారు. ఉద్యోగి ఖాతా నుంచి 50 శాతం, యాజమాన్యం 50 శాతం చందా చెల్లిస్తోంది. వీటికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగులు ఏళ్ల తరబడి పీఎఫ్ సొమ్మును జమ చేస్తుంటారు. అయితే మధ్యలో ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అందుకే ఈపీఎఫ్ఓ మధ్యలో పాక్షికంగా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు డ్రా చేయడానికి కుదరాదు. అత్యవస సమయాల్లోనే డబ్బులు డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
అప్పట్లో విత్ డ్రా చేసుకోడానికి చాలా ఇబ్బంది ఉండేది. ఉద్యోగుల భవిష్యనిధి నుంచి ఉపసంహరణలను ఈపీఎఫ్‌వో మరింత సులభతరం చేసింది. ఇకపై చందాదారుడు తమ వైద్య అవసరాల కోసం నిబంధనలను అనుసరించి ఎన్నిసార్లయినా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఈపీఎఫ్ అడ్వాన్స్ కు సంబంధించి కొత్త నిబంధనలను ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఉద్యోగులు, కార్మికుల వ్యక్తిగత ఈపీఎఫ్ నిధిలో కనీసం 25% నిల్వ ఉంచి మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకునేలా ఇప్పటికే సీబీటీ ఆమోదం తెలిపింది.

ఈపీఎఫ్ చందాదారులు 12 నెలలు దాటిన తర్వాత తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ నుంచి 75శాతం వరకు నిధులను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఈ పాక్షిక ఉపసంహరణల కోసం గతంలో ఉన్న 13 రకాల సంక్లిష్ట నిబంధనలను విలీనం చేసింది. అత్యవసర, గృహ సంబంధించిన అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకు పరిమితి లేదు. ఎన్నిసార్లు అయిన డబ్బులు డ్రా చేసుకోవచ్చు. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల చదువు కోసం మొత్తం సర్వీసులో పదిసార్లు ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చారు.
వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివాహ ఖర్చుల కోసం ఐదుసార్లు పీఎఫ్ డబ్బులు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇల్లు, భూమి కొనుగోలు, గృహ నిర్మాణం, గృహ రుణ చెల్లింపు, మరమ్మతుల కోసం మొత్తం సర్వీసులో ఐదుసార్లు నగదును అడ్వాన్స్‌గా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
