EPFO: గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్ఓ.. రిటైర్డ్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్‌డ్రాకు అవకాశం..!
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అంతే మొత్తంలో యాజమాన్యం కూడా జమ చేస్తోంది. ఈ మొత్తంలో ఈపీఎస్ కూడా ఉంటుంది. ఉద్యోగి జీతం మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యాజమాన్యం చెల్లించిన మొత్తంలో కొంత పీఎఫ్ ఖాతాకు, మిగతాది ఈపీఎస్ లో జమ అవుతుంది.
పీఎఫ్ సోమ్మును అత్యవసర పరిస్థితిల్లో కొంత మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా అలాగే ఉంచుకోవచ్చు. ఈ డబ్బులన్నీ ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత వస్తాయి. అయితే ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన తర్వాత పీఎఫ్ సొమ్మంతా ఒక్కసారిగా వచ్చేస్తుంది.
ఈపీఎస్ లో ఉన్న మొత్తం ప్రకారం నెలనెలా పింఛన్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ డబ్బులు రిటైర్మెంట్ తర్వాత ఒక్కసారిగా కాకుండా.. నెలనెలా విడతలవారీగా పొందే సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(SWP)కి ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను సక్రమంగా నిర్వహించుకునేందుకు ఇది ఖాతాదారులకు అద్భుతమైన అవకాశామని నిపుణులు చెబుతున్నారు. తొలి దశలో 55 ఏళ్లు పైబడిన 6లక్షల 30వేల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈ సదుపాయం వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

SWP ద్వారా రిటైరైన సభ్యులు తమ మొత్తం పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా.. క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇలా తీసుకోగా మిగిలిన బ్యాలెన్స్ ఈపీఎఫ్ వ్యవస్థలోనే ఉండి.. ప్రభుత్వం అందించే వడ్డీ వస్తూనే ఉంటుందని వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సీనియర్ సిటిజన్లు ఎఫ్డీలో డిపాజిట్ చేయకుండా పీఎఫ్ లోనే డబ్బులు ఉంచుకునే అవకాశం ఉంది. ఇందులో అనేక సౌకర్యవంతమైన ఆప్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
కార్పస్ నుంచి నిర్ణీత వ్యవధిలో విత్‌డ్రా చేసుకోవడం, కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకుని మిగిలిన దానిపై వాయిదాలు పొందడం లేదా కేవలం వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే వెసులుబాటును కల్పించారు. రిటైర్మెంట్ తర్వాత కూడా స్వచ్ఛందంగా పీఎఫ్‌లో జమ చేసే మార్గాలను ఈ ఫ్రేమ్‌వర్క్ తీసుకువచ్చే అవకాశం ఉంది. పేరోల్ ద్వారా అదనపు డబ్బు జమ, నేరుగా డిపాజిట్లు, డిజిటల్ పేమెంట్ల ద్వారా చిన్న మొత్తాల జమ వంటివి ఇందులో భాగం అయ్యే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications