EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కీలక సూచన చేసిన ఈపీఎఫ్ఓ.. అలా చేస్తే మీ డబ్బు పోయినట్లే..!
ఉద్యోగం చేసేవారికి దాదాపు అందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుంది. చాలా మంది తమ ఉద్యోగ కాలంలో ఒక్కసారైనా పీఎఫ్ లో కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసి ఉంటారు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్తారు. మరి కొంత మంది తమ పీఎఫ్ ఖాతా తెలుసుకునేందుకు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్తారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని పీఎఫ్ సంస్థ హెచ్చరిస్తోంది. చందాదారులకు పలు సూచనలు ఇచ్చింది. ఆన్ లైన్ లో పీఎఫ్ సేవలు పొందే క్రమంలో ఫేక్ వెబ్ సైట్లకు వెళ్లొద్దని పేర్కొంది. సోషల్ మీడియాలో పీఎఫ్ కు సంబంధించి లింక్ లు వస్తే క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
ఆ లింక్ లు క్లిక్ చేసి మీరు మీ యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉందని తెలిపింది. సోషల్ మీడియాలో, మెయిల్స్ వచ్చే లింక్ లు క్లిక్ చేయవద్దన సూచించింది. అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి విత్ డ్రా చేసుకోవాలని కోరింది. పీఎఫ్ సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్న అధికారిక వెబ్ సైట్ https://www.epfindia.gov.in లేదా https://www.epfo.gov.in లేదా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెళ్లాలని పేర్కొంది. సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్న వేళ ఈపీఎఫ్ఓ సంస్థ ఈ సూచనలు చేసింది.

కాగా ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర కార్మిక శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గరిష్ట వేతన పరిమితి రూ.25 వేలకు పెరిగితే పీఎఫ్ చందా కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత వేతన పరిమితి ప్రకారం జీతంలో 12 శాతం పీఎఫ్ చందాగా కట్ చేస్తారు. ఒక వేళ గరిష్ట వేతన పరిమితి రూ.15 వేల నుంచి 25 వేలకు పెరిగితే ఇందులో 12 శాతం పీఎఫ్ చందాగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఉద్యోగి జీతంలో నుంచి 12 శాతం అంటే రూ.1800 చెల్లిస్తున్నారు. గరిష్ట వేతన పరిమితి రూ.25 వేలకు అప్పుడు పీఎఫ్ చందా రూ.3000కు పెరిగే అవకాశం ఉంది. యాజమాన్యం కూడా అంతే మొత్తంలో పీఎఫ్ ఖాతాలో చెల్లించాలి. దీని వల్ల ఉద్యోగికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే చాలా వరకు కంపెనీల్లో ఎంప్లాయ్, ఎంప్లాయర్ షేరు రెండు ఉద్యోగి ఖాతా నుంచే కట్ చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications