EPFO: నవంబర్ 15 లోగా ఆ పని చేయాలి.. ఈపీఎఫ్ఓ సంస్థ హెచ్చరిక..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ కు సంబంధించి కీలక సూచన చేసింది. యాజమాన్యాలు అక్టోబర్ 2026 నెలకు సంబంధించిన పీఎఫ్ కంట్రిబ్యూషన్లు, ఈసీఆర్ ఫైలింగ్‌ను నవంబర్ 15లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబర్ 12న తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన చేసింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ అవుతాయని పేర్కొంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్లకు సంబంధించిన వివరాలను యాజమాన్యాలు ఈపీఎఫ్ఓకు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియనే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR) అని అంటారు. ఇందులో ఉద్యోగుల వివరాలు, వారి వేతనాలు, పీఎఫ్ కింద ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈసీఆర్ సమర్పించిన తర్వాత సంబంధిత పీఎఫ్ మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఈసీఆర్‌ను ఫైల్ చేయడంతో పాటు, పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా నవంబర్ 15, 2026లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు దాటితే.. నిబంధనల ప్రకారం అదనపు వడ్డీ, నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ పనిని పూర్తి చేయాలని ఎక్స్ లో ట్వీట్ చేసింది.

ఈసీఆర్ ఫైల్ చేసే ముందు ఉద్యోగుల పేర్లు, వ్యక్తిగత వివరాలు, జీతాల సమాచారం, పీఎఫ్ లెక్కలను ఒకసారి సరిచూసుకోవాలని కూడా సూచించింది. ఏవైనా తప్పులు ఉంటే వాటిని ముందుగానే సరిదిద్దుకోవాలని పేర్కొంది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే చివరి నిమిషంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి, గడువుకు ముందే ఫైలింగ్, చెల్లింపు రెండూ పూర్తయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించింది. కాగా ఈపీఎస్‌లో భాగంగా ఇచ్చే కనీస పెన్షన్ పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అయితే కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచే అవకాశం ఉంది.
ఇందుకు సంబంధించి నవంబర్ 19న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 81.48 లక్షల ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ పెన్షన్ దారులు ఉన్నారు. ఇందులో సుమార్ 73.55 లక్షల మందికి రూ.3 వేల లోపు పింఛన్ తీసుకుంటున్నారు. కనీస పింఛన్ రూ.3 వేలకు పెంచిదే వీరందరికి లబ్ధి చేకూరనుంది. 2014లో ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచింది. అప్పుడు కూడా కనీస పింఛనును రూ.1000 చేసింది. 2014 కు ముందు చాలా మందికి రూ.1000 లోపు పింఛన్ ఉండేది. పెరిగిన ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకుని కనీస పింఛన్ ను రూ. 5000 చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం రూ.3000 కనీస పింఛన్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications