EPFO: వాట్సాప్ లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గత కొద్ది కాలంగా అనేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకప్పుడు పీఎఫ్ క్లైయిమ్ కోసం ఆఫీసులకు వెళ్లేవారు ఇప్పుడు ఆన్ లైన్ లో క్లయిమ్ చేసుకుంటున్నారు. త్వరలోనే క్లైయిమ్ డబ్బును ఏటీఎం ద్వారా కూడా డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అప్పట్లో ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు చాలా సింపుల్ గా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దాదాపు అన్ని పీఎఫ్ సేవలను ఆన్ లైన్ చేసి చందాదారులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తాజాగా పీఎఫ్ అప్డేట్స్ కోసం వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది.
దాదాపు అందరు వాడే వాట్సాప్ వేదికగానే పీఎఫ్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. కేవలం వెరిఫైడ్ నంబర్‌కు ఒక్క 'హలో' మెసేజ్ పంపిస్తే చాలు.. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం నుంచి క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్ వరకు అన్నీ అరచేతిలోకి వచ్చేస్తాయని పీఎఫ్ సంస్థ ప్రకటించింది. బ్లూ టిక్ ఉన్న అధికారిక ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా ఆటోమేటెడ్ చాట్‌బాట్ సేవలు క్షణాల్లో స్టార్ట్ కానున్నాయి. ఆ తర్వాత మీరు మీ ఖాతాలో ఎంత పీఎఫ్ నిల్వ ఉందో వెంటనే చెక్ చేసుకోవచ్చు. చివరి ఐదు లావాదేవీల (లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్) మినీ స్టేట్‌మెంట్ పొందే అవకాశం ఉంది.

విత్‌డ్రాయల్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం పెట్టిన క్లెయిమ్ స్టేటస్ ఎక్కడిదాకా వచ్చిందో లైవ్‌గా ట్రాక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ అధికారిక అప్‌డేట్లు, తాజా సర్క్యులర్లను వాట్సాప్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ రీజినల్ ఆఫీస్ వాట్సాప్ నంబర్స్ కూడా పీఎఫ్ అందుబాటులో ఉంచింది. మాదాపూర్ ఆఫీస్ 9100026146, బర్కత్‌పురా ఆఫీస్ 9100026170, కూకట్‌పల్లి ఆఫీస్ 9392369549,
పటాన్‌చెరు ఆఫీస్ 9494182174.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
