PF Pension: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కనీస పింఛన్ రూ.1000 నుంచి రూ.3000 లకు పెంపు..!
పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం. ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కింద ఇచ్చే కనీస పెన్షన్ పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కనీస పింఛన్ రూ.1000 గా ఉంది. అయితే ఈ కనీస పెన్షన్ ను పెంచాలని ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై ఈపీఎఫ్ఓ సంస్థ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కనీస పింఛనును రూ.3 వేలకు పెంచేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కనీస పెన్షన్ రూ.3000 ఇచ్చేందుకు కేంద్ర ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖతో కార్మిక శాఖ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నవంబర్ 19న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యేక ఎజెండాగా కనీస పింఛన్ విషయం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 81.48 లక్షల ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ పెన్షన్ దారులు ఉన్నారు. ఇందులో సుమార్ 73.55 లక్షల మందికి రూ.3 వేల లోపు పింఛన్ తీసుకుంటున్నారు. కనీస పింఛన్ రూ.3 వేలకు పెంచిదే వీరందరికి లబ్ధి చేకూరనుంది. కాగా సెప్టెంబర్ ఈపీఎఫ్ఓ సంస్థ కనీస జీతాన్ని రూ.15 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. దీంతో పీఎఫ్ చందా పెరిగింది. ఇప్పుడు కనీస పెన్షన్ గురించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

2014లో ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచింది. అప్పుడు కూడా కనీస పింఛనును రూ.1000 చేసింది. 2014 కు ముందు చాలా మందికి రూ.1000 లోపు పింఛన్ ఉండేది. పెరిగిన ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకుని కనీస పింఛన్ ను రూ. 5000 చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం రూ.3000 కనీస పింఛన్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పీఎఫ్ చందాదారులకు అందరికి పింఛన్ వస్తుందా సందేహాలు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పీఎఫ్ చందా కంట్రీబ్యూషన్ కనీసం 10 సంవత్సరాలు ఉండాలి. వారే పింఛన్ తీసుకునేందుకు అర్హత సాధిస్తారు.
10 సంవత్సరాలు పీఎఫ్ సర్వీస్ లేకుంటే వారు పెన్షన్ కు అనర్హులు. పెన్షన్ కు అర్హత సాధించిన వారికి 58 ఏళ్ల ఈపీఎస్ పింఛన్ వస్తుంది. ఈ పింఛన్ అనేది మీ ఈపీఎస్ ఖాతాలో జమైన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ 10 ఏళ్ల కంటే పీఎఫ్ సర్వీస్ తక్కువగా ఉండి.. వారు ఉద్యోగం మానేస్తే వారు పీఎఫ్ మొత్తం, పింఛన్ జమైన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications