For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ TS-bPass: అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వివరాలు, తప్పుగా చెబితే కూల్చివేత..

|

భవన నిర్మాణాలు, లే-అవుట్ల అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానంలో టీఎస్-బీపాస్ (తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతి స్వీయ ధ్రవీకరణ విధానం) ద్వారా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకే పూర్తి బాధ్యత ఇచ్చి నిర్మాణ అనుమతుల్లో సరికొత్త విధానానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. అయితే తప్పుడు సమాచారం ఇచ్చినా, నిబంధనలు ఉల్లంఘించినా ఎలాంటి నోటీసులు లేకుండా నిర్మాణాలను కూల్చివేస్తారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన టీఎస్-బీపాస్‌ను సోమవారం ప్రారంభించారు.

అనుమతులు ఎలా అంటే..

అనుమతులు ఎలా అంటే..

75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మాణం కోసం అనుమతి అవసరం లేదు. కేవలం స్థల రిజిస్ట్రేషన్ ఉంటే చాలు.

600 చదరపు గజాలలోపు స్థలాలకు స్వీయ ధ్రవీకరణతో వెంటనే అనుమతి లభిస్తుంది.

600 చదరపు గజాల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. అలా అనుమతి రాలేదంటే 22వ రోజు సాఫ్టువేర్ సిస్టం అనుమతి ఇస్తుంది.

అనుమతుల సమాచారం రెరాకు వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు.

తెలంగాణలో పట్టణ జనాభా 43 శాతంగా ఉంది. 2025 లేదా 2027 నాటికి 51 శాతానికి చేరుకోవచ్చు. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డులోనే 40 శాతం పట్టణ జనాభా ఉంటుంది.

నాలాలు, చెరువుల ఎఫ్‌టీఎల్‌లలో నిర్మాణాలకు అవకాశం లేకుండా జీహెచ్ఎంసీ కొత్త చట్టం తీసుకు రానుంది.

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉంటాయనే పేరు ఉంది. దీనిని అలాగే కొనసాగించాలని మంత్రి కేటీఆర్ టీఎస్-బీపాస్ ప్రారంభం సందర్భంగా సూచించారు.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్..

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్..

టీఎస్-బీపాస్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వెబ్ సైట్ ఉంటుంది.

ఆన్-లైన్ ద్వారా సరళమైన దరఖాస్తు విధానం అందుబాటులో ఉంటుంది.

అనుమతులకు సింగిల్ విండో విధానం. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపక, నీటిపారుదల, రెవెన్యూ, జలమండలి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అనుమతులకు ప్రత్యేక దరఖాస్తు అవసరంలేదు.

టీఎస్-బీపాస్‌లో అనుమతికి దరఖాస్తు చేసుకుంటే వివిధ శాఖలు నిరభ్యంతర పత్రాలను పది రోజుల్లో ఇస్తాయి.

అదనపు సమాచారం, కొలత వివరాలకు పది రోజుల గడువు.

7 మీటర్ల ఎత్తు, 200 చ.మీ. లోపు ఇంటి నిర్మాణానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అవసరం లేదు.

7 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు, 500 చ.గ. కంటే ఎక్కువ ఉంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వెంటనే వస్తుంది.

10 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు 21 రోజుల్లో జారీ అవుతుంది.

ఖర్చులు వారే భరించాలి

ఖర్చులు వారే భరించాలి

భవన నిర్మాణ అనుమతుల కాలపరిమితి మల్టీస్టోరియెడ్ కాకుంటే మూడేళ్లు. మల్టీస్టోరియెడ్ అయితే అయిదేళ్లు. లే-అవుట్ అనుమతి కాలపరిమితి రెండేళ్లు.

తప్పుడు సమాచారం, నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణాల కూల్చివేతకు, చట్టపరమైన ఇతర చర్యలు, కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని ఇంటి వ్యక్తులే భరించాలి.

నిర్దేశించిన గడువులోగా సమాచారం ఇవ్వని అధికారులకు బాధ్యత ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు.

నిబంధనలకు అనుగుణంగా లేని దరఖాస్తులను ఏ కారణం చేత నిరాకరిస్తున్నారో తొలి వారంలోనే దరఖాస్తుదారుకు తెలియజేయాలి.

English summary

తెలంగాణ TS-bPass: అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వివరాలు, తప్పుగా చెబితే కూల్చివేత.. | Telangana: TS bPass to issue building layout permission online

The Telangana government has officially launched the TS-bPass, an initiative to issue building layout permissions online. Speaking to the media, Municipal Administration and Urban Development Minister KT Rama Rao said that TS-bPass has been launched with the aim of enabling instant permissions and registration of buildings, ensuring a hassle-free process for landowners and property developers.
Story first published: Tuesday, November 17, 2020, 10:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X