Multibagger Stock: ఒకే రోజు 20 శాతం పెరిగిన ఫార్మా స్టాక్.. ఒక నెలలోనే 43 శాతం జంప్..!

సోమవారం ఫార్మా స్టాక్స్ ర్యాలీ కనిపించింది. ప్రముఖ ఫార్మా స్టాక్ అయిన తత్వ చింతన్ కెమ్ షేర్ ప్రైస్ సోమవారం ఉదయం 10:06 గంటలకు బీఎస్ఈలో 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయింది. ఈ రోజు ఈ స్టాక్ రూ.285 పెరిగి రూ. 1,713కు చేరింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. 23 లక్షల (2.3 మిలియన్ల) ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. జూలైలో ఇప్పటివరకు తత్వ చింతన్ ఫార్మా కెమ్ షేరు ధర 43 శాతం పెరిగింది. ఈ స్టాక్ 2025 నవంబర్ 18న ఈ స్టాక్ ప్రైస్ రూ.1,603దా ఉండేది. అలాగే 2021 నవంబర్ 3న ఈ స్టాక్ రూ.2,975 వద్ద రికార్డు స్థాయి గరిష్టాన్ని తాకింది.

జూన్ 30, 2026 త్రైమాసికం ముగిసే సమయానికి పెట్టుబడిదారుడు ముకుల్ మహావీర్ అగర్వాల్ తత్వ చింతన్ ఫార్మా కెమ్‌లో 2.14 శాతం హోల్డ్ చేస్తున్నారు. ముకుల్ అగర్వాల్ కు హింద్ రెక్టిఫైయర్స్, న్యూల్యాండ్ లాబొరేటరీస్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్, ASM టెక్నాలజీస్, PTC ఇండస్ట్రీస్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్‌తో సహా 74 స్టాక్‌లలో 1 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది. తత్వ చింతన్ ఫార్మా కెమ్ ప్రధానంగా ప్రత్యేక రసాయనాల తయారీ, అమ్మకం, పంపిణీ చేస్తోంది. వీటిలో ఫేజ్ ట్రాన్స్‌ఫర్ ఉత్ప్రేరకాలు, స్ట్రక్చర్ డైరెక్టింగ్ ఏజెంట్లు, ఎలక్ట్రోలైట్ లవణాలు, ద్రావణాలు, ఫార్మాస్యూటికల్, ఆగ్రోకెమికల్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయి.

Multibagger Stock

తత్వ చింతన్ ఫార్మా కెమ్ పన్ను తర్వాత లాభం రెట్టింపు అయింది. లాభం రూ.16 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది ₹6.7 కోట్లుగా ఉంది. ఎబిట్డా మార్జిన్ 15 శాతం నుంచి 19 శాతానికి చేరింది. ప్రపంచ రసాయన పరిశ్రమలో చైనా 46 శాతం వాటాను కలిగి ఉంది. భారతదేశం కేవలం 1-2 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. చైనా పోటీతత్వం తగ్గడం వల్ల కలిగే సానుకూల ప్రభావం, భారత్ తన మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి మార్గం సుగమం చేసిందని కంపెనీ పేర్కొంది.

గుజరాత్‌లోని భరూచ్ జిల్లా దహేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని 'దహేజ్-III' వద్ద ఉన్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌లో వివిధ ప్రత్యేక రసాయనాల తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనకు తమ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కొత్త తయారీ కేంద్రం కంపెనీ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, పెరుగుతున్న మార్కెట్ డిమాండ్లను తీర్చడంలో సహాయపడుతుందని తత్వ చింతన్ ఫార్మా పేర్కొంది. ఈ కంపెనీకి ఎస్డీఏ, పీటీసీ, పీఏఎస్సీ నుంచి ఎక్కువ ఆదాయం వచ్చిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకుల చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+