మార్కెటులో ఇప్పుడు ఎన్నో రకాల వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. అయితే బ్రాండెడ్ వాటర్ బాటిల్ పేరును కాస్త అటు ఇటుగా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి థర్డ్ పార్టీ కంపెనీలు. అయితే ఒకప్పటినుంచి ఉన్న ప్రముఖ వాటర్ బాటిల్ బ్రాండ్స్ లో కిన్లే, బిస్లెరి, టాటా పేర్లు ఎక్కువగా గుర్తుంటాయి. ఒకానొక సందర్భాల్లో బిస్లెరి పేరు మారుమోగిపోయి ఇప్పటికి ఆలా కొనసాగుతుంది. అయితే ఇంతటి పేరుకు ప్రజల్లో బిస్లెరి అదరకు కారణం ఎవరు అని ఊహించారా ఎప్పుడైనా.. సాధారణంగా దాహం వేస్తే షాపుకి వెళ్లి వాటర్ బాటిల్ అని అడిగేవాళ్ళం, కానీ ఇప్పుడు బిస్లెరి వాటర్ అని అడగడం చూస్తున్నాం. ఇంతటి ఘనతకి ఒకరిద్దరు కాదు చాలా మందికి అనుభవమే ఉంది. అసలు విషయానికి వస్తే బిస్లరీ సంస్థను నిర్మించిన ఘనత దాని యజమాని రమేష్ చౌహాన్.
భారతదేశంలో మినరల్ వాటర్ అనే స్థాయికి బిస్లరీ ఎదిగింది. ఇందుకు రమేశ్ చౌహాన్‌కు ఎంత క్రెడిట్ దక్కుతుందో, ఆయన కూతురు జయంతి చౌహాన్‌కు కూడా అంతే ప్రశంసలు దక్కుతాయి. బాటిల్ వాటర్ బ్రాండ్ల విధిని మార్చిన శక్తివంతమైన లీటరుగా జయంతి అవతరించారు. జయంతి నేడు సంస్థలో ముఖ్యమైన నాయకురాలిగా ఎదిగినా మొదట్లో అలా జరగలేదు. జయంతికి మొదట్లో తన తండ్రి వ్యాపారంలో పనిచేయడం ఇష్టం లేదు. అదే విధంగా బిస్లరీ అమ్మకాల కీలక సమయంలో జయంతి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఇష్టం లేకున్నా బాధ్యతలు స్వీకరించిన జయంతి తర్వాత కంపెనీలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా కంపెనీ ఇప్పుడు బ్రాండ్ గా అవతరించింది.

బిస్లరీ సంస్థ నేడు ఏ స్థాయికి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సంస్థ సక్సెస్, ఫెయిల్యూర్ ఏంటో తెలుసా.... గత 50 సంవత్సరాలుగా బిస్లరీ 32% మార్కెట్ వాటాతో ప్రముఖ బాటిల్ వాటర్ బ్రాండ్‌గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే నేడు ఇండియాలో అమ్ముడవుతున్న వాటర్ బాటిల్ పరిశ్రమలో బిస్లరీ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. అలాగే బిస్లరీకి ఇండియాలో సొంత ప్లాంట్, 4,500 డిస్ట్రిబ్యూటర్స్ నెట్‌వర్క్ ఉంది. ప్రస్తుతం బిస్లరీ సంస్థ దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం, బిస్లరీ బ్రాండ్ మొత్తం విలువ రూ.7,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇండియాలోని మినరల్ వాటర్ బాటిల్ పరిశ్రమలో బిస్లరీ ఒక ప్రముఖ కంపెనీగా అవతరించినప్పటికీ పానీయాల మార్కెట్ పోటీదారుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 2022లో కాంపా కోలాను రిలాంచ్ చేసింది. ప్రస్తుతం కోకాకోలా, పెప్సికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వంటి పెద్ద కంపెనీల ఉత్పత్తులను ప్రభావితం చేసింది.
కాంపా కోలా ఎంతగా పాపులారిటీ పొందింది అంటే పోటీ ధరలను ఎదుర్కోవడానికి కోకా-కోలా 400 ml బాటిల్ ధరను రూ.5 తగ్గించింది. దీనితో కాంపా కోలా 500 ml బాటిల్‌కు రూ.20 ధరను నిర్ణయించింది. అప్పట్లో జయంతి చౌహన్ మొదట్లో తన తండ్రి వ్యాపారాన్ని నడపడానికి ఇష్టపడలేదు. దీంతో రమేష్ చౌహాన్ తన బిస్లరీ కంపెనీని దాదాపు రూ.7 వేల కోట్లకు టాటా కంపెనీకి విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ తర్వాత జయంతి తన తండ్రి వ్యాపారం గురించి మరింత తెలుసుకుని వ్యాపారాన్ని చేపట్టి సంస్థను విజయవంతంగా కొనసాగించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications