PF Balance Check In WhatsApp: వాట్సాప్లో పీఎఫ్ బ్యాలెన్స్, పాస్ బుక్, ఈపీఎస్, చివరి ఐదు లావాదేవీలు చెక్ చేసుక
ఉద్యోగం చేసే దాదాపు అందరికి పీఎఫ్(PF) ఖాతా ఉంటుంది. నెల జీతంలో కొంత మొత్తం పీఎఫ్ చందాగా చెల్లిస్తారు. జీతంలో 12 శాతం పీఎఫ్ చందా కోసం కట్ అవుతుంది. అంతే మొత్తంలో యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పీఎఫ్ కనీస వేతన రూ.25000 చేసింది. ఉదాహరణకు ఓ వ్యక్తి జీతం రూ.25 వేలు అనుకుంటే అందులో 12 శాతం పీఎఫ్ చందాగా కట్ చేస్తారు. ఈ మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. యాజమాన్యం చెల్లించే అంతే మొత్తంలో పీఎఫ్ ఖాతాకు కొంత. మిగతా మొత్తం ఈపీఎస్(ఎంప్లాయి పెన్షన్ స్కీం ) కు జమ చేస్తారు. అయితే మీకు మీ జీతంలో ఎంత కట్ అవుతుంది. ఎంత ఈపీఎస్ కు వెళ్తుందో తెలుసుకోవాలి.
ఇందుకోసం మీ పే స్లీప్ లో యూఏఎన్ నంబర్ ఉంటుంది. ఈపీఎఫ్ఓ పోర్టల్ కు వెళ్లి యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్ సైట్ లాగిన్ అయి పీఎఫ్ వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓ ఈ వాట్సాప్ లో కొన్ని సేవలు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, చివరి ఐదు లావాదేవీలు తెలుసుకోవడం, పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు మీరు మీ ఫోన్ లో 8796441800 నంబర్ ను సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ కు వెళ్లి ఈ నంబర్ కు హాయ్ పెట్టాలి. అయితే మీరు మీ ఆధార్ రిజిస్ట్రర్డ్ నంబర్ నుంచి వాట్సాప్ కమ్యూనికేషన్ చేయాల్సి ఉంటుంది.

మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టగానే.. మీకు వెల్ కమ్ ఈపీఎఫ్ఓ అని వస్తుంది. ఆ తర్వాత సెలక్ట్ యూవర్ లాంగ్వేజ్ అని వస్తుంది. అప్పుడు మీకు వచ్చిన లాగ్వేంజ్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మెన్ ఓపెన్ అవుతుంది. అందులో పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, పాస్ బుక్ డౌన్ లోడ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ పై క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ అని వస్తుంది. అప్పుడు మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వాట్సాప్ లో ఎంటర్ చేయాలి. అయితే మీకు పీఎఫ్ ఖాతాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే.. అక్కడ చూపిస్తుంది. మీరు ఏ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటే దానిపై క్లిక్ చేయాలి.
అప్పుడు మీకు పీఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మొత్తం బ్యాలెన్స్ తో పాటు ఈపీఎస్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. అదే విధంగా మీరు చివరి ఐదు లావాదేవీలు, పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు పీఎఫ్ లో అడ్వాన్స్ విత్ డ్రా చేయాలనుకుంటే కేవలం పీఎఫ్ డబ్బుల నుంచి మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈపీఎస్ డబ్బులను విత్ డ్రా చేసుకోలేరు. ఈపీఎస్ డబ్బులు విత్ డ్రా చ చేసుకోవాలనుకుంటే ఉద్యోగం పూర్తిగా మానేస్తే తీసుకువచ్చు. మీరు రిటైర్డ్ అయ్యే వరకు ఈపీఎస్ అలాగే ఉంటే ఆ తర్వాత మీకు నెలనెలా పింఛన్ వస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications